లెజెండ్ రివ్యూ

0

“లెజెండ్” అనిపించుకున్న బాలయ్య

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రంగా అభిమానులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. అదిరిపోయే డైలాగులు, మురిపించే ఫైట్లు, బాలయ్య-జగపతిబాబుల అద్భుతమైన నటనతో అభిమానులకి ఒక పండుగ తెచ్చింది “లెజెండ్” . ఈ ఇద్దరు నిన్నటి తరం హీరోలు పోటాపోటీగా నటించడం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈలలు వేయిస్తోంది.

ఏముంది సినిమాలో?:

ఒక సగటు ప్రేక్షకుడికి ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి. కళ్ళారా చూసుకునేంత అందం ఉంది. మనసారా నవ్వుకునేంత కామెడీ ఉంది. చెవులారా వినేంత చక్కటి పాటలు, నేపథ్య సంగీతం ఉంది.. అన్నిటికీ మించి, నటీనటుల అద్భుతమైన నటన ఉంది..

ఇంతకీ కథేంటో?:

ఒక ఊరిలో పెద్ద క్రిమినల్ అయిన వాడు, మరొక ఊరికెళ్ళి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చేస్తాడు. గాయపడ్డ మనిషి తాలూకు వ్యక్తులు యాక్సిడెంట్ చేసిన వాడిని నిలదీయగా , అతను ఆ మనుషులని కోపంలో ఛంపేస్తాడు. అది భరించలేని ఆ ఊరిపెద్ద సుమన్, సదరు వ్యక్తిని జైలుకి పంపిస్తాడు. అది మనసులో పెట్టుకుని, సుమన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని, బెయిల్ మీద బయటకొచ్చి సుమన్ భార్యా , కొడుకుని అతను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ కాబడ్డ సుహాసిని ని ఆ విలన్ ఛంపేస్తాడు. దాంతో కోపం ఆపుకోలేని ఆ పిల్లవాడు తల్లిని చంపినందుకు కాను, అక్కడున్న అందరినీ చంపేసి అక్కడనుంచి పారిపోతాడు. ఇక అక్కడనుంచి ఇరువైపులా ప్రతీకార చర్యలు మొదలయ్యి ఎక్కడ అంతం అవుతుంది, చివరకు ఏమవుతుంది అన్నది కథ.

ఎవరెలా చేశారు?

బాలకృష్ణ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. యం. రత్నం వ్రాసిన డైలాగులు బాలయ్య తనదైన స్టైల్ లో చెప్పి, అభిమానులతో ఈలలు వేయిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ పాటలకి హుషారుగా స్టెప్పులేసి ఆదరహో అనిపిస్తున్నాడు. “సింహా”ని మించి ఇందులో ఉన్న ఫైట్లు, అభిమానుల్లో హుషారును రెండింతలు చేసింది అంటే అతిశయోక్తి కాదు.

ఇకపోతే, తక్కువ నిడివిగల పాత్రనే చేసినా, సుహాసిని తనదైన శైలిలో మెప్పించింది. కాకపోతే, అంత అద్భుతమైన నటి, తెరమీద ఇంకాస్త కనిపిస్తే బాగుండేది కదా అనిపించింది.

ఇక ముఖ్యంగా, జగపతి బాబు పాత్ర గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ప్రస్తుతం, వరుస ఫ్లాపులతో తన వైభవాన్ని కోల్పోతున్న జగపతిబాబుకి, బోయపాటి నుండి వచ్చిన పిలుపు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ కి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ప్రతినాయకుడి పాత్రలో, అద్భుతమైన నటనని కనబర్చిన జగపతిబాబు, “లెజెండ్” సినిమా ఘనవిజయం సాధించడంలో కీలకమైన పాత్రని పోషించాడు అనడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.

సోనాలీ చౌహాన్ , తన అందచందాలతో కుర్రకారుకి కిర్రెక్కిస్తుంది అని చెప్పక తప్పదు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.

బోయపాటి దర్శకత్వం సంగతి మరి?

గతంలో బోయపాటి శ్రీను, నందమూరి నట సింహం బాలకృష్ణతో చేసిన బ్లాక్ బస్టర్ హిట్ “సింహా” ని మించి , దర్శకుడు “లెజెండ్” ని మలిచాడు అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి కలయికలో రెండవ సినిమా అనేసరికి, తప్పకుండా అభిమానులు ఎంతో ఆశని పెట్టుకుంటారు. ఎవరి ఆశలని వమ్ము చేయకుండా “లెజెండ్” ఉంటుంది అనవచ్చు.

సంగీతం గురించి ఓ రెండు ముక్కలు చెప్పమంటే?

మొట్టమొదటి సారి , అటు బాలకృష్ణతో- ఇటు బోయపాటి శ్రీనుతో కలిసి పనిచేసిన దేవిశ్రీప్రసాద్… మెలోడీ, మాస్ , క్లాస్ లని మిక్స్ చేసి…అందరికీ నచ్చే సంగీతం అందించాడు. ఇక నేపథ్య సంగీతం అయితే, బాలయ్య నటనని మరో మెట్టు ఎక్కించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఎంత అద్భుతమైన నటన కనబరిచినా, సరైన బ్యాక్ గ్రౌండ్ సంగీతం లేకుంటే, ఎంతటి గొప్ప నటన అయినా తేలిపోతుంది.

ఇంకేమైనా ఉందా చెప్పడానికి?:

చివరిమాట గా చెప్పుకోవాలి అంటే, మొత్తంగా “లెజెండ్” ఒక చరిత్ర సృష్టించే సినిమా అనొచ్చు. అందులో ఎంతమాత్రం సందేహం అక్కర్లేదు. నందమూరి అభిమానులు కనీసం నాలుగైదు సార్లైనా చూస్తారు … అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.

మరి రేటింగ్?

కళ్ళు మూసుకుని ఐదుకి నాలుగేసుకోవచ్చు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts