టెల్ మీ బాస్ పిక్చర్స్ ‘కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం

0

Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్రం ప్రారంభోత్సం శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియో వేదికగా జ‌రిగింది. ముహూర్త‌పు స‌న్నివేశానికి టి.సుబ్బ‌రామి రెడ్డి క్లాప్ ఇవ్వ‌గా…. నిర్మాత రాజ్ కందుకూరి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు, హీరో శ్రీకాంత్ గారు, ఇంకా మరెందరో విచ్చేశారు. యాక్షన్, లవ్, కామెడీ, సెంటిమెంట్‌లతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుందని శ్రీచక్ర నమ్మకంగా వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరూపుకుని వచ్చే దసరా కళ్ళ రిలీస్ ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

ల‌వ్, యాక్ష‌న్, మార్ష‌ల్ ఆర్స్ట్ వంటి అంశాల‌తో సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కిస్తున్నామ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు తెలిపారు.

ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు లీడ్ రోల్స్‌లో కుమార్ రాజా, ప్రియా చౌదరి, ప్రియాంక శర్మ, D10 ఫేమ్ ఆక్సాఖాన్ నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా నటశిఖరం సాయికుమార్, తొలిపరిచయంగా జీత్ సింగ్ నటిస్తున్నారు. సపోర్టింగ్ ఆర్టిస్టులుగా సత్యప్రకాష్, హేమా, హిమజ, రాజీవ్ కనకాల, రఘుబాబు, ఫన్ బకెట్ ఫేమ్ మహేష్ విట్ట, భరత్, జబర్దస్త్ ఫేమ్ రైజింగ్ రాజు తదితరులు నటిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌
మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, ...
powered by RelatedPosts