కొత్తగా ఉన్నాడు’ ఆడియో విడుద‌ల‌

0

తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం `కొత్తగా ఉన్నాడు’. రాజా మీడియా వరల్డ్ సమర్పణలో జై బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై ఎం.కె.రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాష్ సరసన ప్రియ, సోనియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ఎం.రాధా దర్శకత్వం వహించారు. యు.కె.మురళి సంగీతం సమకూర్చారు.

ఈ చిత్రం ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ ధియేటర్ లో ఘనంగా జరిగింది. ఆడియోతోపాటు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో ఆకాష్, నిర్మాత ఎం.కె.రాజా, సంగీత దర్శకుడు యు.కె.మురళి, ప్రముఖ నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి, వైకుంఠపాళి నిర్మాత జైరామ్, నటుడు-నిర్మాత దినేష్ మాడ్నే, యువ దర్శకుడు రవిశర్మ, నిర్మాతలు బాల్ రెడ్డి, బలవంత్ రెడ్డి, హీరోయిన్స్ ఆర్తి సురేష్, సుమ, లక్కీ, కొరియోగ్రాఫర్ వేణు పాల్గొన్నారు.

సినిమా టైటిల్ లానే ఆకాష్ చాలా కొత్తగా ఉన్నాడని, ఈ సినిమాతో అతనికి మళ్ళీ పెద్ద హిట్ రావాలని వేడుకలో పాల్గొన్నవారంతా ఆకాక్షించారు.
లండన్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఆంద్ర కుర్రాడిగా, తెలంగాణ కుర్రాడిగా రెండు షేడ్స్ కలిగిన పాత్రలో నటించానని, విక్రమ్
అరిచితుడి తరహాలో అందర్నీ అలరిస్తుందని’ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన హీరో ఆకాష్ అన్నారు. ఆకాష్ గారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనని, `కొత్తగా ఉన్నాడు’ చిత్రానికి అన్ని పాటలు బాగా కుదిరాయని మ్యూజిక్ డైరెక్టర్ యు.కె.మురళి అన్నారు. `కొత్తగా ఉన్నాడు’ చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండడం ఆనందంగా ఉందని, ఈ చిత్రంతో తనకు మంచి బోణి లభిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత ఎం.కె.రాజా అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షాన్, ఎడిటింగ్: ప్రేమ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts