రోజుకి 15 గంటలు కష్టపడుతున్నాడట

0

256337-srkతలపండిన సినీ పాత్రికేయులు, పాత తరం అభిమానులకి నేటి నటీనటుల అంకితభావం పట్ల కాస్త అసంతృప్తి ఉంది అన్న మాట వాస్తవం. ఎందుకంటే, అప్పట్లో ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల పూర్తి నిబద్ధతతో, ఎంతో కష్టపడి పనిచేసేవాళ్ళు. కానీ నేటి తరం హీరో హీరోయిన్లలో ఆది లోపిస్తోంది అని అనుకునే వాళ్ళకి , బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ లాంటి వాళ్ళు సమాధానంగా నిలుస్తున్నారు. తమ సీనియర్స్ కి ఏమాత్రం తీసీపోకుండా ఎంతో కష్టపడుతున్నారు. ఎలా……అని అడిగితే ఇలా అని చెప్పవచ్చు. మీరూ చదవండి మరి.

ఆదిత్యా చోప్రా నిర్మాతగా, మనీశ్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాన్’సినిమా కోసం ఆ పాత్రను పండించడానికి తన శాయశక్తులా శ్రమిస్తున్నాడు. పేరుకు తగ్గట్లే ఈ సినిమాలో వీరాభిమాని పాత్రను పోషిస్తున్నారాయన. తాజాగా ఈ చిత్రం కోసం ఒక రోజు ఏకధాటిగా 15 గంటలు షూటింగ్‌లో పాల్గొని, చెమటోడుస్తున్నాడు. ఆ సంగతి స్వయంగా షారూఖ్ ఖానే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం తన నిజజీవిత ఫ్యాన్స్‌కు అంకితమంటూ షారుఖ్ ప్రకటించాడు కూడా! ఈ ఏడాది దీపావళికి ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం ద్వారా అభిమానుల్ని పలకరించనున్న షారుఖ్ ఆ తరువాత ‘ఫ్యాన్’తో అలరిస్తాడన్న మాట! ఎంతైనా, పడ్డ కష్టం వృధాగా పోదు కదా! ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts