కాలా టీజ‌ర్ వాయిదా

0

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ టీజర్‌ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో టీజర్‌ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని రజనీ అల్లుడు, నిర్మాత ధనుష్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.‘గౌరవనీయ జగద్గురు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య పరమపదించిన నేపథ్యంలో ‘కాలా’ టీజర్‌ను మార్చి 2కు వాయిదా వేస్తున్నాం. టీజర్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రజనీ అభిమానులకు క్షమాపణలు’ అని ధనుష్‌ ట్వీట్‌ చేశారు.

‘కాలా’ చిత్రంలో రజనీ..కరికాలన్‌ అనే డాన్‌ పాత్రలో నటించారు. వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ధనుష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ రజనీకి జోడీగా నటించారు. నానా పటేకర్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌
మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, ...
  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
powered by RelatedPosts