కాగ్ ఆరోపణలపై స్పందించిన  జూనియ‌ర్ ఎన్టీఆర్

0
2015లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నటించినందుకు లండన్‌ కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 7.33 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని, ఇందులో పన్నుగా చెల్లించాల్సిన 1.10 కోట్ల రూపాయలను ఎక్స్‌ పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసుగా పరిగణించి పన్ను మినహాయింపునిచ్చారని కాగ్ తెలిపిందని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వనున్నామని ఆర్థిక శాఖ అనుబంధ రెవెన్యూ విభాగం తెలిపిన సంగతి కూడా తెలిసిందే. అయితే దీనిపై ఎన్టీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు.
నాన్న‌కు ప్రేమ‌తో  లండన్ లో నిర్మించిన చిత్రం.  పొరుగు దేశం లో అందించిన సర్వీస్ (హీరో గా) కు భారత దేశం లో సర్వీస్ టాక్స్ వర్తించదు అని నాకు చెప్పడంతో, చట్టం ప్రకారమే నేను “నాన్నకు ప్రేమతో” సినిమా నిర్మాతల వద్ద సర్వీస్ టాక్స్ వసూలు చేయలేదు. 2016 లో, ఇదే విషయం పై CAG నుండి వచ్చిన క్వెరీ కి లిఖిత పూర్వం గా మా ఆడిటర్ లు స్పందించటం జరిగింది. ఆ స్పందన తరువాత, ఎటువంటి అధికారిక ఉత్తర్వులు కానీ, నోటీసు లు కానీ మాకు అందలేదు. చాలా సంవత్సరాలు గా ఆదాయపు పన్ను మరియు సర్వీస్ టాక్స్ క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వ్యక్తిని నేను. భారత పౌరుడి గా నా చట్టపరమైన బాధ్యతలను ఎన్నడూ మరువలేదన్నారు. ఈ విషయం లో సంబంధిత అధికారుల నుండి నాకు ఆదేశాలు అందితే, నా వైపు నుండి నేను చట్టపరం గా చెల్లించాల్సిన రుసుము ఏమైనా ఉంటే, అణా పైసల తో సహా చెల్లించేందుకు నేను సిద్ధము గా ఉన్నానని తెలిపారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
powered by RelatedPosts