'జిల్', 'రేయ్' చిత్రాలు రిలీజ్ రేపే..

0

rey-audio647x450గోపీచంద్ హీరోగా రూపొందిన ‘జిల్’, సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రేయ్’ చిత్రాలు రేపు (27.3.2015) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రెండింటిలో బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టబోయే సినిమా ఏదనే విషయంలో ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది.

గోపీచంద్, రాశిఖన్నా కెమిస్ట్రీ హైలెట్
‘లౌక్యం’ తర్వాత గోపీచంద్ చేసిన సినిమా ‘జిల్’. ‘లౌక్యం’ మంచి విజయాన్ని అందుకున్న నేపధ్యంలో ‘జిల్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ‘లౌక్యం’ చిత్రం గోపీచంద్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది. ‘జిల్’ పోస్టర్స్ చాలా కూల్ గా, రొమాంటిక్ ఉన్నాయి. ఇందులో రాశిఖన్నా కథానాయికగా నటించింది. గోపీచంద్, రాశిఖన్నా కెమిస్ర్టీ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని ఈ చిత్రం యూనిట్ చెబుతూ వస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఓ లిప్ లాక్ సీన్ కూడా ఉందట. గత సినిమాల్లో సింఫుల్ గర్ల్ గా నటించిన రాశిఖన్నా, ఈ సినిమాలో చాలా గ్లామర్ గా నటించింది. ఇటీవల విడుదలైన ఆడియోకి కూడా మంచి స్పందన లభించింది. ఇన్ని ప్లస్ పాయింట్స్ తో విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లను కొల్ల గొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ అంచాలను ఏ మేరకు ఈ సినిమా అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

స్టైలిష్ లుక్ తో సాయిధరమ్ తేజ్
‘రేయ్’ సినిమా సాయిధరమ్ తేజ్ కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. అతను తొలి సినిమా ఇది. కాకపోతే విడుదల లేటవ్వడంతో దీని తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందుగా విడుదలయ్యింది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా సాయిధరమ్ కి మంచి భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని ఫ్రూవ్ చేసింది. కానీ తను హీరోగా నటించిన తొలి చిత్రం ‘రేయ్’ విడుదలవ్వకపోవడం మాత్రం సాయిధరమ్ తేజ్ ని తెగ బాధపెడుతోంది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించగానే రెట్టింపు ఉత్సాహంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు సాయిధరమ్ తేజ్. యాక్షన్ తో పాటు డ్యాన్స్ కి స్కోప్ ఉన్న పాత్రను ‘రేయ్’ లో చేసాడ. ఈ సినిమాకి సంబంధించి చాలా స్టైలిష్ లుక్ తో విడుదలైన సాయిధరమ్ తేజ్ పోస్టర్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సయ్యామీ ఖేర్ కథానాయికగా నటిస్తే, శ్రధ్దాదాస్ నెగటివ్ షేడ్ రోల్ చేసింది. పవన్ కళ్యాణ్ అండదండలు ఈ సినిమాకి మెండుగా ఉన్నాయి. ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలవుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాలను ఏ మేరకు ‘రేయ్’ చేరుకుంటుందో వేచి చూడాల్సిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts