మా అజెండా ఇది: జయసుధ

0

Jayasudha Panel Press Meet About MAA Elections Photos (5)మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలని ఆపాలని నటుడు ఓ కల్యాణ్ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టి పారేయడంతో మార్చి 29 న “మా” అసోసియేషన్ కి అధ్యక్ష పదవికి ఎన్నికలు యధాతధంగా జరగనున్నాయి. అయితే, ఫలితాలు మాత్రం తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా బయటపెట్టవద్దు అని కోర్టు స్పష్టం చేయడంతో , ‘,మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్రప్రసాద్ మరియు సహజనటి – డా: జయసుధ వర్గాల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. ఎవరికీవారు ప్రెస్ మీట్స్ పెట్టి ప్రత్యర్ధి వర్గం మీద వెటకారాలు, విసుర్లు వేస్తూ సినీ అభిమానుల్లో మరింత గందరగోలానికి, అసహనానికి దారి తీస్తున్నారు. మొన్న రాజేంద్రప్రసాద్ పెట్టిన మీటింగ్‌లో జయసుధ వర్గం వారికి ఒక అజెండా అంటూ ఏమీ లేదు అని ఎద్దేవా చేయడంతో ఈరోజు మళ్లీ జయసుధ తన ప్యానల్ తో మరో ప్రెస్ మీట్ పెట్టి తమ అజెండా ని ప్రెస్ ముందు ప్రవేశపెట్టారు.

జయసుధ ప్యానల్ అజెండా వివరాలివి:

– మాట వరుసకి ఇంతమంది అంతమంది అని చెప్పకుండా, మేము ఒక కమిటీని వేసి సమగ్రంగా సర్వే చేసి , నిజంగా ఎంతమంది అర్హులు ఉంటే అంతమంది౮కి , అంటే వీలైనంత ఎక్కువమందికి ఇన్సూరెన్స్ చేయిస్తాం.
– పరిశ్రమలో పేద కళాకారులకి కేవలం ఇన్సూరెన్స్, మెడి క్లెయిం లు మాత్రమే బాధలు కావు. అంతకంటే ఇంకా చాలా ఇబ్బందులు, అవసరాలుంటాయి. అలాంటి పేద కళాకారుల ఇతరత్రా ఇబ్బందులు, అవసరాలు ఏమిటో గుర్తించడానికి ‘గ్రీవియెన్స్ సెల్’ ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సెల్ లోని కమిటీ మెంబర్స్ అంత ప్రతీ నెల ఒక రోజు ‘మా’ ఆఫీసులో కూర్చుని పేద కళాకారుల అవసరాలని, ఇబ్బందులని అన్ని నోట్ చేసుకుని , వీడియోలో రికార్డ్ చేసుకుని వీలైనంత త్వరలో వారికి సహాయం అందించే చర్యలు తీసుకుంటాం.
– ఎంతోమందికి ఈరోజున నెలలో కనీసం మూడు నాలుగు రోజుల పని కూడా దొరికే పరిస్థితి లేదు. అలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్న వాళ్ళని మేము గుర్తించి , వారికి ఆర్ధికంగా సహాయం అందించడం మాత్రమే కాకుండా , వారికి నెలలో కనీసం అయిదు రోజులైనా కచ్చితంగా పని దొరికేలా చేస్తాం.
– బయట వాళ్ళనెవరినొ సహాయం చేయమని ఆర్ధించే ముందు, మా ప్యానల్ లోని సభ్యులం ముందుగా మేమే మా సొంత డబ్బుని ముందుగా ‘మా’ ఫండ్స్ లో జమ చేస్తాం. ఆ తరువాత కార్పొరేట్ సెక్టార్స్ నుండి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా రాబట్టే విధంగా చర్యలు తీసుకుంటాం.
– అంతే కాకుండా, ప్రతీసారి ‘మా’ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రాంశ్ ని కేవలం హైదరాబాదు, విశాఖలలోనే ఎక్కువగా నిర్వహించడం చేస్తుంటారు. ఆ పద్ధతికి స్వస్తి చెప్పి, ఇకమీదట ఆంధ్ర, తెలంగాణా లోని ప్రతి జిల్లాలో ‘మా’ ఆర్టిస్టులతో కల్చరల్ ప్రోగ్రాంశ్ ని ఏర్పాటు చేసి ఫండ్స్ రైజ్ చేస్తాం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts