బంతిపూల జానకి పాటలో జయం రవి- త్రిష

0

trisha-gets-jayam-ravi-tattoo-on-her-thighsబంతిపూల జానకి.. జానకి అంటూ బాద్ షా మూవీలో జూనియర్- కాజల్ వేసిన స్టెప్పులు సినీజనాలకు బాగానే గుర్తుండి ఉంటాయి. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ పాట అప్పట్లో అభిమానులతో చిందులు వేయించింది. ఎస్ఎస్ థమన్ సంగీతంలో దలేర్ మెహందీ పాడిన ఈ పాట చిత్రీకరణ అంతా కూడా మంచుకొండల్లో జరిగింది. థమన్ క్యాచీ ట్యూన్ కు.. ఎన్టీఆర్- కాజల్ స్టెప్పులు కూడా తోడవ్వడంతో పాట ఇన్ స్టంట్ హిట్ అయింది. బాద్ షా సినిమా పేరు ఎత్తగానే మ్యూజిక్ లవర్స్ కు ఈ పాటే గుర్తు వస్తుంది. ఇప్పుడీ సూపర్ హిట్ సాంగ్ ట్యూన్ ను యాజ్ టీజ్ గా వాడేస్తున్నాడు థమన్. కాకపోతే మళ్లీ ఇక్కడే కాదు.. ఈసారి పక్కనున్న తమిళ తంబీల దగ్గర. సాంగ్ ఓకే.. మరి స్టెప్పులేసి కేక అనిపించేది ఎవరనే కదా మీ నెక్ట్స్ క్వశ్చన్. జస్ట్ వెయిట్ అక్కడికే వచ్చేస్తున్నాం.అసలు మ్యాటర్ ఏంటంటే.. జయం రవి- త్రిష హీరోహీరోయిన్లుగా తమిళంలో అప్పా టక్కర్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో అంజలి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. సూరజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు సంగీతం అందిస్తున్నాడు థమన్. ప్రస్తుతం ఈ అప్పా టక్కర్ సినిమాకు సంబంధించి సాంగ్స్ షూట్ చేస్తోంది మూవీ యూనిట్. చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జయం రవి- త్రిషపై ఒక ఫోక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ పాట మరేదో కాదు.. ఎన్టీఆర్- కాజల్ చిందులేసిన బంతిపూల జానకి. ఈ హిట్ ట్యూన్ లిరిక్స్.. ప్లేస్.. పర్సన్స్ ను మార్చి షూట్ చేస్తున్నారట అప్పా టక్కర్ టీమ్… మరి ఎన్టీఆర్- కాజల్ అదిరిపోయే స్టెప్పులకు మించి.. జయం రవి- త్రిష కూడా బంతిపూల జానకి పాటలో అదరహో అనిపిస్తారేమో చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో డిమాండ్
సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తె...
ఏప్రిల్‌ 20న భ‌ర‌త్, మే 4న సూర్య
రెండు చిత్రాల నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం ఏప్రిల్‌ 26నే 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో త...
తార‌క్ తో త్రివిక్ర‌మ్ సైలెంట్ మోడ్
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక...
powered by RelatedPosts