జయ జానకి నాయక రివ్యూ

0
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. జగపతిబాబు.. ప్రగ్యా జైస్వాల్‌.. శరత్‌కుమార్‌.. వాణీ విశ్వనాథ్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: రిషి పంజాబీ
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి
రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంస్థ: ద్వారకా క్రియేషన్స్‌
మాస్టార్స్. కామ్ రేటింగ్ 3/5
ముందుమాట‌:  బెల్లంకొండ సాయి శ్రీనివాస్- స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `జ‌య జాన‌కి నాయక‌` చిత్రంపై ఓ మోస్తారుగా అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఆ సినిమా  నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మాస్ అంశాల‌తో సినిమాలు చేసే బోయ‌పాటి మ‌రి కొత్త కుర్రాడితో ఎలాంటి ఎటెంప్ట్ చేశాడో తెలియాలంటే స‌మీక్ష‌పై  ఓలుక్ వేయాల్సిందే.
క‌థ‌: గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌)కు కుటుంబం అంటే చాలా ఇష్టం. నాన్న చక్రవర్తి (శరత్‌కుమార్‌) అన్నయ్య(నందు)లంటే  ప్రాణం. అనుకోకుండా గగన్‌కు స్వీటీ(రకుల్‌ప్రీత్‌సింగ్‌) పరిచయం అవుతుంది. ఆమె రాకతో చక్రవర్తి ఇంటి కి కొత్త వ‌స్తుంది.  స్వీటీ-గగన్‌ ప్రేమించుకుంటారు. అయితే స్వీటీ జీవితంలో అనుకోని ఓ సంఘటన ఎదురవుతుంది. అప్పటి వరకూ ఆడ‌తా పాడ‌తా సాగిపోయిన‌ ఆమె జీవితం  ఒక్కసారిగా పంజరంలో పావురం అవుతుంది. అలాంటి స్వీటీని రక్షించడానికి గగన్‌ కుటుంబం ఏం చేసింది? అశ్వింత్‌ నారాయణ (జగపతిబాబు)కీ, స్వీటీకి ఉన్న సంబంధం ఏమిటి? అన్న విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాల‌సిస్: బోయ‌పాటి శ్రీను సినిమాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్రేమ‌..కుటుంబం విలువ‌ల‌కు యాక్ష‌న్ జోడించి తెర‌కెక్కించడ‌మే ఆయ‌న‌కున్న ఎకైక  శైలి. ఈ క‌థ కూడా అలాంటింది. ఇన్నోసెంట్ గా ఉన్న హీరోను, హీరోయిన్ ల‌వ్ చేయ‌డం.. అనుకోకుండా ఆమె జీవితంలో భ‌ద్ర సినిమాలా  పెను మార్పులు.. వాటి నుంచి హీరోయిన్ ను బ‌య‌ట‌ప‌డేయ‌డ‌మే హీరో ల‌క్ష్యం. సింపుల్ గా సినిమా పాయింట్ ఇది. ప‌రువు అంటే ప‌డిచచ్చే తండ్రి… వ్యాపారం కోసం యుద్దం చేసే విల‌న్…వీళ్లిద్ద‌రి కీళ్లు వంచే హీరో కుటుంబం చుట్టూనే క‌థ తిరుగుతుంది. ప్ర‌ధ‌మార్థం భ‌ద్ర సినిమాలా న‌డిచిపోతుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో హీరోయిన్ సెకెండ్ షేడ్ ను కొంచెం డిఫ‌రెంట్ గా ఎలివేట్ చేయ‌డం.. త‌దుప‌రి క‌థ అంతా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుతో సాగిపోతుంది. అయితే క‌థ‌లో ఏ మాత్రం కొత్త‌ద‌నం లేదు. ఫైట్స్ ను బోయ‌పాటి శైలిలో భారీ స్థాయిలో తీర్చిదిద్దాడు. ఓ కొత్త హీరోకు ఆ రేంజ్ ఫైట్ లు అవ‌స‌ర‌మా? అనిపించేలా ఉంటాయి? ఈ రోజుల్లో ఇమేజ్ ఉన్న హీరో చేసే ఫైట్లు చూడాలంటేనే క‌ష్టంగా ఉంది. అలాంటిది సాయి శ్రీనివాస్ తో ఫైటింగ్ స‌న్నివేశాలంటే ఆడియ‌న్స్ కు ఎంత వ‌ర‌కూ క‌నెక్ట్ అవుతాయ‌న్న‌ది కొంచెం ఆలోచించి ఉండాల్సింది. అయితే సినిమాకు పెట్టిన ఖ‌ర్చు మాత్రం భారీగానే ఉంది. ప్ర‌తీ స‌న్నివేశాన్ని  చాలా క్వాలిటీగా తెర‌కెక్కించారు. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఉండ‌టంతో సినిమా భారీ స్పాన్ తో నే తెర‌కెక్కింద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. సాయి శ్రీనివాస్ లోని హీరోయిజం ను ఎలివేట్ చేయ‌డం కోసం బోయ‌పాటి ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. రకుల్ క్యారెక్ట‌రైజేషన్ బాగుంది. జ‌గ‌ప‌తి బాబు పాత్ర‌లో పాత ఎక్స ప్రెష‌న్స్ నే ప‌లికించాడు. పాత్ర‌లో వెయిట్ ఉన్నా హీరోయిజం ను ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నంలో అత‌న్ని ప‌ట్టించుకున్న‌ట్లు లేదు. మెయిన్ విల‌న్ ను క్లైమాక్స్ లో సింపుల్ గా తేల్చేశాడు.  ఓవ‌రాల్ గా మాస్ ను ఓ కింత ఆక‌ట్టుకొవ‌చ్చు.
న‌టీన‌టులు:సాయి శ్రీనివాస్ పాత్ర బాగుంది. ప్ర‌ధ‌మార్థంలో ఇన్నోసెంట్ గా చ‌క్క‌గా న‌టించాడు. యాక్ష‌న్ స‌న్నివేశాలు కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. శ‌ర‌త్ కుమార్, నందు పాత్ర‌లకు మంచి వెయిట్ ఉంది. జ‌గ‌ప‌తి బాబు పాత్ర ఇంట‌ర్ డ‌క్ష‌న్ బాగుంది గానీ,   పెద్ద‌గా ఎలివ‌టే్ కాలేదు. వాణి విశ్వ‌నాథ్ పాత్ర‌కు ఇంకా వెయిట్  ఇస్తే బాగుండేది.  మిగ‌తా పాత్ర‌లు త‌మ ఫ‌రిది మేర బాగానే న‌టించారు.
సాంకేతిక‌వర్గం:బోయ‌పాటి పాత క‌థ‌..ఓల్డ్ టేకింగ్ బోర్ కొట్టించాయి. జ‌య‌జానకి నాయ‌క అని కూల్ టైటిల్ పెట్టి క‌థ‌ను ఎటో న‌డిపించిన‌ట్లుంది. కెమెరా వ‌ర్క్  బాగుంది. ఒక పాట మినిహా మిగ‌తా  పాట‌లు సోసో గా ఉన్నాయి. ఆర్. ఆర్ ప‌ర్వాలేదు. ఎడిటింగ్ లోపాలున్నాయి. ల్యాగ్ ఎక్కువ‌గా ఉంది. నిర్మాణ విల‌వువ‌లు బాగున్నాయి.
చివ‌రిగా: మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts