జూలై 31న “జయ జానకి నాయకి” ఆడియో విడుదల !

0
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “జయ జానకి నాయక”. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించారు.
క్లాస్-మాస్ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన “జయ జానకి నాయక” ఆడియోను జూలై 31న అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించబడనుంది.
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. “ఏ విషయంలోనూ రాజీపడకుండా “జయ జానకి నాయక” చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇటీవల విడుదల చేసిన “నువ్వేలే నువ్వేలే” పాటకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. దేవి మళ్ళీ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు. జూలై 31న ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. ఆడియో విడుదల తర్వాత సినిమా మీద ఉన్న క్రేజ్ ద్విగుణీకృతమవుతుందన్న నమ్మకం ఉంది. విడుదల చేసిన టీజర్స్, పోస్టర్స్ ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకొంటుండడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్,  పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
'రుణం' పాటల విడుదల
 ఎస్.వి.మల్లిక్ తేజ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో విడుదలయ్యింది. రేవంత్, హేమచంద్ర, హరి చరణ్, ...
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని అభినందించిన TFJA
టి. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని స...
powered by RelatedPosts