జ‌య జాన‌కి నాయ‌క హిట్ షురూ: డైరెక్ట‌ర్ బోయ‌పాటి

0

Boyapati srinu

బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జయజానకినాయక’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్స్‌. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా

మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ”ఇప్పటి వరకు బోయపాటిగారు చేసిన సినిమాలన్నింటిలో ‘జయజానకినాయక’ బెస్ట్‌ మూవీ అని చెప్పగలను.బోయపాటిగారు ఇప్పటి వరకు 6 సినిమాలు చేశారు. ఆరు సినిమాలు సూపర్‌హిట్‌ సినిమాలే. ఈ సినిమాలన్నింటిలో ఏదో ఒక కంటెంట్‌ మనకు కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో మంచి లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌, మాస్‌ ఆడియెన్స్‌కు కావాల్సిన యాక్షన్‌ ఉన్నాయి. సినిమాను తప్పకుండా ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”ఆర్‌.ఆర్‌తో సినిమాను చూశాను. చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. నా కెరీర్‌ ప్రారంభంలో ఇది నా సినిమా అని జీవితాంతం చెప్పుకునేలా ఉంటుంది. సినిమాను ఇంత గ్రాండ్‌గా తీసినందకు రవీందర్‌రెడ్డిగారికి థాంక్స్‌. ఈ సినిమా సక్సెస్ తో ర‌వీంద‌ర్ గారు టాప్‌ లీగ్‌ ప్రొడ్యూసర్‌ అవుతారు. జానకి క్యారెక్టర్‌ రకుల్‌ తర్వాత మరేవరూ చేయలేరని అంటారు. ప్రగ్యా చాలా బాగా నటించింది. జగపతిబాబు, శరత్‌కుమార్‌ వంటి లెజెండ్స్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది` అని అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ” భద్ర తర్వాత నేను చేసిన బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ. ఫీల్‌ గుడ్‌ మూవీ ఇది. లవ్‌, ఎమోషన్స్‌, యాక్షన్‌ అన్ని ఉన్నాయి. మా ప్రయత్నంతో ఎంతో మంచి సినిమా చేయాలో అంత మంచి సినిమా. నేను చేసిన నిర్మాతలందరితో నేను హ్యాపీనే. అల్లు అరవింద్‌గారితో సరైనోడు సినిమా చేశాను. ఎంతో కంఫర్ట్‌బుల్‌ నిర్మాత. ఆ రేంజ్‌లో మిర్యాల రవీందర్‌రెడ్డి సినిమా చేశాడు` అని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts