ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా `జ‌య జానకి నాయ‌క` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

0

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. బోయపాటి శ్రీను దర్శకుడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన‌ ద‌ర్శ‌కుడు వి. వి.వినాయ‌క్ సీడీల‌ను ఆవిష్క‌రించి యూనిట్ స‌భ్యుల‌కు అంద‌జేశారు. అనంత‌రం ..

ద‌ర్శ‌కుడు వినాయ‌క్ మాట్లాడుతూ, ` సాయి సినిమా అంటే త‌న తండ్రిగా ఎంత ఎగ్జైట్ గా ఫీల‌వుతారో…నేను అలా ఫీల‌వుతా. ఇందులో సాయి డైలాగ్ ల‌ను చాలా మెచ్యురుడీగా చెప్పాడు. ట్రైల‌ర్ చాలా బాగుంది. ఛ‌త్ర‌ప‌తి సినిమా ఇంట‌ర్వ‌ల్ బ్లాక్ చూస్తే ఎలా ఉంటుందో ట్రైల‌ర్ అలా ఉంది. ర‌వీంద‌ర్ రెడ్డి స్టీల్ బిజినెస్ చేస్తాడు గానీ, మ‌నిషి మాత్రం గోల్డ్. టేస్ట్ ఉన్న నిర్మాత‌. సినిమా కోసం ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తాడు. బోయ‌పాటి శ్రీనుకు అణువ‌ణువునా సినిమానే. అవుట్ ఫుట్ తీసుకోవ‌డంలో బోయ‌పాటి ఎక్క‌డా రాజీ ప‌డ‌డు. అల్లుడు శీను సినిమా ట్రైల‌ర్ చూసి సెకెండ్ మూవీ చేస్తాన‌ని ముందుకు వ‌చ్చింది శ్రీనునే. ఇందులో ఏడు పాట‌లు బాగున్నాయి. రిషీ పంజాబీ గారు ఫోటోగ్ర‌ఫీ బాగుంది. లెజెండ్ సినిమా లా సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ, `ఈ ఏడాది తెలుగు ప‌రిశ్ర‌మ‌లో నాలుగు అద్భుతాలు జ‌రిగాయి. ఒక‌టి క‌ళా త‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం… రెండు బాహుబ‌లి -2 తెలుగు జాతి ఖ్యాతిని న‌లుదిశ‌లా వ్యాప్తిచేయ‌డం. తెలుగు వారు త‌ల ఎత్తుకునేలా చేసిన సినిమా అది. చిరంజీవి గారు వ‌స్తారా? రారా ? అనుకుంటోన్న స‌మ‌యంలో ఆయ‌న మ‌ళ్లీ రంగంలోకి దిగి `ఖైదీ నంబ‌ర్ 150` తో 150 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించారు. ఇక `లెజెండ్` 1000రోజుల పాటు ఆడ‌టం నాలుగు అద్భుతాలు. తెలుగు సినిమా ఇంత సంతోషంగా ఉందంటే కార‌ణం ప్రేక్ష‌కులే. కొత్త‌గా వెళ్లాల‌న్నా ఉద్దేశంతో జ‌య జాన‌కి నాయ‌క అని పెట్టాం. ఈ టైటిల్ ఐడియా నా అసోసియేట్ ఇచ్చాడు. లైఫ్ లో క‌ష్టం వ‌చ్చిన ప్ర‌తీ సారి ప్రేమ‌ను వ‌దిలేస్తాం. కానీ నేను వ‌ద‌ల‌ను అనే పాయింట్ తో సినిమా ఉంటుంది. నాతండ్రి,అమ్మ‌, అన్న ను ఎలా ప్రేమించానా..త‌న ల‌వ‌ర్ ను కూడా అలా ప్రేమించాలి అనే కుర్రాడి పాత్ర అది. ప్ర‌తీ ఒక్క‌రి హృద‌యాల‌ను ట‌చ్ చేస్తుంది. ఇలాంటి క్యారెక్ట‌ర్ మా ఇంట్లో ఉండాల‌ని చెప్పుకునే పాత్ర అది. హంస‌ల‌దీవి ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుంది. మంచి నిర్మాత‌లు తెలుగు సినిమాకు కావాలి. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి గారితో సినిమాలు చేయ‌డానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటా` అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ, `టైటిల్ సూప‌ర్బ్ గా ఉంది. బోయ‌పాటి గారితో నాల్గ‌వ సినిమా. ఆయ‌న‌తో ప‌నిచేస్తున్న‌ప్పుడు మంచి ఎక్స్ పీరియ‌న్స్ ఇచ్చింది. ఈ మూవీ లో ఆయ‌న మార్క్ క‌నిపిస్తుంది. మాస్ అంశాల‌తో పాటు రొమాంటిక్ అంశాల‌తో వైవిథ్యంగా తెర‌కెక్కించారు. సాయిలో అల్లుడు శీను సినిమా కు ఈ మూవీకి చాలా తేడా క‌నిపిస్తుంది. ర‌కుల్ పాత్ర బాగుంది. శ‌ర‌త్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు గారు మ‌మ్మ‌ల్ని బాగా ఇన్ స్పైర్ చేస్తుంటారు. చంద్ర బోసు గారు నువ్వేనువ్వేలే సాంగ్ ను బాగా రాశారు. ఆ పాట హైలైట్ గా ఉంటుంది. శ్రీమ‌ణి ఇందులో 5 పాట‌లు రాశాడు` అని అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, `బోయ‌పాటిగారు నాతో సినిమా చేయ‌డం నాకు బూస్టింగ్ లాంటింది. అందుకు ఆయ‌న‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. బోయ‌పాటి గారు ఎంత పెద్ద స్టార్ తోనైనా సినిమా చేయ‌గ‌ల‌రు. కానీ న‌న్ను న‌మ్మి సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. దేవి మంచి ఆల్బ‌మ్ అందించారు. ప్ర‌తీ టెక్నిషీయ‌న్ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌ట్టాడు. శ‌ర‌త్ కుమార్, జ‌గ‌ప‌తిబాబు, వాణి విశ్వ‌నాధ్ వంటి సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో స్ర్కీన్ షేర్ చేసుకోండా నా అదృష్టంగా భావిస్తున్నా. రకుల్ పాత్ర మాత్రం కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. ఈ సినిమా నాకు చాలా క్రుషియ‌ల్ . నా డ్రీమ్ మానాన్న ఆయ‌న డ్రీమ్ లో తీసుకుని ఫుల్ ఫిల్ చేస్తున్నారు` అని అన్నారు.

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, `బోయ‌పాటి గారు న‌న్ను కొత్త‌గా చూపించారు. నా గ‌త సినిమాల‌కు భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎమోష‌న‌ల్ యాంగిల్ కూడా ఉంది. న‌న్ను న‌మ్మి పాత్ర ఇచ్చినందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నా. స‌రైనోడు త‌ర్వాత ఆయ‌న‌తో క‌లిసి సినిమా చేశాను. శ్రీను మంచి పెర్పామ‌ర్. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమా ఆయ‌న కెరీర్ ను మార్చేస్తుంది. దేవీ శ్రీ మంచి బాణీలు అందించారు` అని అన్నారు.

నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ, `మ‌న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో స్టార్ల‌కు ఎంత రెస్ప‌క్ట్ ఉంటుందో..అంతే విధంగా టెక్నిషియ‌న్ కు కూడా అంతే రెస్ప‌క్ట్ ఇస్తారు. ఇది తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు గ‌ర్వ‌కార‌ణంగా చెప్పుకోవాలి. ఆనమ్మ‌కంతోనే బోయ‌పాటి గారి తో సినిమా చేశా. సినిమా కోసం ఆయ‌న‌కు కావాల్సిన‌వ‌న్నీ చ‌క్క‌గా స‌మ‌కూర్చాను. బోయ‌పాటి లేక‌పోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా ప్రారంభ‌ద‌శ‌లోనే సినిమాకు మంచి బిజినెస్ జ‌రిగింది. ప్రేక్ష‌కుల అంచ‌నాలకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంది. హీరో సాయి శ్రీనివాస్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. దేవిగారు అంకిత భావంతో ప‌నిచేస్తారు. మొత్తం ఏడు పాట‌లకు మంచి సంగీతం అందించారు. అన్నీ అద్భుతంగా ఉంటాయి. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

సీనియ‌ర్ న‌టి వాణి విశ్వ‌నాథ్ మాట్లాడుతూ, ` బోయ‌పాటి గారు మాస్ మ‌ల్టీస్టార్ డైరెక్ట‌ర్. నిర్మాత ర‌వీంద‌ర్ రెడ్డి గారు సాప్ట్. ఇద్ద‌రు క‌లిసి మంచి సినిమా చేశారు. సాయి ఫ్యూచ‌ర్ లో పెద్ద స్టార్ అవుతాడు. అలాగే ఈ సినిమాతో నా రీ ఎంట్రీని అదృష్టం గా భావిస్తున్నా. మంచి టెక్నిషీయ‌న్ల‌తో ప‌నిచేసినందుకు సంతోషంగా ఉంది.` అని అన్నారు.

ఈ వేడుక‌లో జ‌గ‌ప‌తిబాబు,శ‌ర‌త్ కుమార్, చంద్ర‌బోస్, శ్రీమ‌ణి, రిషి పంజాబ్, మిర్యాల న‌వ్య‌, బెల్లంకొండ ప‌ద్మావ‌తి, చిత్ర యూనిట్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాయి శ్రీనివాస్ తో మ‌రో శ్రీనివాస్
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీని...
ఛ‌లో డైరెక్ట‌ర్ తో న‌యా బ్యాన‌ర్!
నాగశౌర్య .. రష్మిక మండ‌న‌ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘ఛలో’ ఇటీవ‌ల విడ‌దులైన స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ అన్ని వ‌ర్గాల...
గ్యారెంటీగా 'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుంది: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌
యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయ...
powered by RelatedPosts