మూడు కోట్ల సెట్ లో  బీచ్ ఫెస్టివల్ సాంగ్ !!

0
ఇప్పటికే విడుదలైన టీజర్-పోస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న “జయ జానకి నాయక” ఖాతాలో మరో విశేషం చేరింది. ఎన్నడూలేని విధంగా.. విశాఖపట్నం సమీపంలో మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఓ సెట్ ను నిర్మించింది చిత్ర బృందం. బీచ్ ఫెస్టివల్ నేపధ్యంలో ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో ఓ ఎనర్జిటిక్ నెంబర్ ను పిక్చరైజ్ చేయనున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ ఈ ఎనర్జిటిక్ అండ్ రోమాంటిక్ బీచ్ ఫెస్టివల్ సాంగ్ చిత్రీకరణ జరగనుంది.
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “జయ జానకి నాయక”. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది.
ఈ పాట చిత్రీకరణ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. “ఏ విషయంలోనూ రాజీపడకుండా “జయ జానకి నాయక” చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇప్పుడు ఒక బీచ్ సాంగ్ కోసం వైజాగ్ లో 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ భారీ సెట్ ను నిర్మించాం. బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల కాంబినేషన్ లో ఈ పాటను చిత్రీకరించనున్నాం. ఆగస్ట్ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని అభినందించిన TFJA
టి. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని స...
సాయి శ్రీనివాస్ తో మ‌రో శ్రీనివాస్
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీని...
ఛ‌లో డైరెక్ట‌ర్ తో న‌యా బ్యాన‌ర్!
నాగశౌర్య .. రష్మిక మండ‌న‌ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘ఛలో’ ఇటీవ‌ల విడ‌దులైన స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ అన్ని వ‌ర్గాల...
powered by RelatedPosts