`ఇదేం దెయ్యం` రివ్యూ

0
2.5 Awesome
  • MAA Stars Rating 2.5
  • User Ratings (4 Votes)
    2.8

idem_deyyam

న‌టీన‌టుల‌: శ‌్రీనాధ్ మాగంటి, ర‌చ్చ ర‌వి, ఆర్.ర‌వి, కిరాక్ ఆర్పీ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: వి. ర‌వివ‌ర్మ‌
నిర్మాత : ఎస్ . స‌రిత‌
రేటింగ్: 2.5/5
ముందుమాట‌: ఏ.వి ర‌మ‌ణ‌మూర్తి స‌మ‌ర్ప‌ణ‌లో చిన్మ‌య‌నంద ఫిల్మ్స్ ప‌తాకంపై ఎస్. స‌రిత నిర్మించిన చిత్రం `ఇదేం దెయ్యం`. శ్రీనాధ్ మాగంటి హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. సాక్షి క‌క్క‌ర్ , ర‌చ‌న స్మిత్, రుచి పాండే నాయిక‌లు. ర‌చ్చ ర‌వి, కిరాక్ ఆర్.పి కీల‌క పాత్ర‌ధారులు. వి. ర‌వివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచ‌గా, బాలు స్వామి సంగీతం అందించారు. భారీ ప్రమోషన్ నడుమ తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. హార్ర్ర్ కామెడీ నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో చూద్దాం.

క‌థ‌: రాజేష్ ( శ్రీనాద్ మాగంటి), గిటార్ గిరి (ర‌చ్చ ర‌వి) ఆది రెడ్డి ( ఆర్.పి) ముగ్గురు మంచి స్నేహితులు. అమ్మాయిలంటే పిచ్చి. ఆ యావ‌తో క‌నిపించిన ప్ర‌తీ అమ్మాయికి సైట్ కొడుతుంటారు. అనుకోకుండా ముగ్గురు అమ్మాయిలు వాళ్ల‌కు క‌నెక్ట్ అవుతారు. స్వామిజీ ( జీవా) కార‌ణంగా వాళ్లంతా ఓ బిల్డింగ్ లోకి ఎంట‌ర‌వుతారు. అక్క‌డ వాళ్ల‌కు ఎదురైన అనుభ‌వాలేంటి? అస‌లు వాళ్ల‌ ముగ్గురికీ క‌నెక్ట్ అయింది అమ్మాయిలేనా? లేక వాళ్ల‌లో మ‌రో యాంగిల్ ఏమైనా ఉందా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాల‌సిస్: హార‌ర్ కామెడీ నేప‌థ్యానికే కాస్త రొమాంటిక్ ట‌చ్ ఇచ్చి తెర‌కెక్కించిన సినిమా ఇది. ద‌ర్శ‌కుడు ర‌వివ‌ర్మ హాస్యానికి పెద్ద పీఠ వేసాడు. ఆ పాయింట్ ను హైలైట్ చేస్తూనే క‌థ‌ను త‌న స్టైల్లో చెప్పాడు. హీరోల ప‌రిచ‌య స‌న్నివేశాలు రొటీన్ గా ఉన్నా…బంగళాలోకి ఎంట‌రైన త‌ర్వాత క‌థ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. మూడు ఫెయిర్ ల మ‌ధ్య జ‌రిగే రొమాంటిక్ స‌న్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటాయి. ద‌ర్శ‌కుడు కాన్సంట్రేష‌న్ అంతా హీరోయిన్ల అందాల‌ను ఎలివేట్ చేయ‌డంపైనే దృష్టిపెట్టాడు. దీంతో అలాంటి స‌న్నివేశాలు యూత్ కు బాగా క‌నెక్ట్ అవుతాయి. ర‌చ్చ ర‌వి, శ్రీనాద్, ఆర్ పీల కామెడీ ట్రాక్ బాగా వ‌ర్కౌట్ అయింది. ర‌వి, ఆర్ పిలు బుల్లి తెర ఆర్టిస్టులు కావ‌డంతో ఆడియ‌న్స్ కు తొంద‌ర‌గా క‌నెక్ట్ అయిపోతారు. త‌మ స్టైల్ కామెడీ స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ఇక హీరో శ్రీనాధ్ మాగంటి కొత్త కుర్రాడైన చ‌క్క‌గా న‌టించాడు. యాక్టింగ్ లో ఈజ్ ఉంది. దెయ్యాల‌తో దెబ్బ‌లు తినే స‌న్నివేశాల్లో ముగ్గురు చక్క‌గా న‌టించారు. ముఖ్యంగా ర‌చ్చ ర‌వి క్యారెక్ట‌ర్ ను మిగ‌తా రెండు క్యారెక్ట‌ర్లు కంటే కొంచెం భిన్నంగా క‌నిపిస్తుంది. దెబ్బ‌లు తిన్నా…అమ్మాయిలంటే వ్యామోహం త‌గ్గ‌లేద‌న్న ట‌చ్ ను అక్క‌డ అక్క‌డ చూపించాడు. ఆరంభంలో కొన్ని స‌న్నివేశాలు బోర్ క‌ట్టినా క‌థ‌లోకి వెళ్లే కొద్ది ఆస‌క్తి పెరిగుతుంది. ఓవ‌రాల్ గా ఈ దెయ్యం బాగానే న‌వ్వించింది.

న‌టీన‌టులు: శ‌్రీనాద్, ర‌చ్చ‌, ఆర్ పి న‌ట‌న బాగుంది. హీరోయిన్లు కొత్త వాళ్లైనా చ‌క్క‌గా న‌టించారు. ముఖ్యంగా సాక్షి క‌క్క‌ర్ రోల్ సినిమా కు హైల్స్ అయింది. మిగ‌తా పాత్ర‌లు త‌మ ఫ‌రిది మేర న్యాయం చేసాయి.

సాంకేతిక వ‌ర్గం: పాత క‌థే అయినా రొమాంటిక్ ట‌చ్ తో చ‌క్క‌గా క్యారీ చేశారు. పాట‌లు, రీరికార్డింగ్ బాగుంది. కెమెరా వ‌ర్క్ బాగా కుదిరింది. కొన్ని స‌న్నివేశాలు ఎడిట్ చేస్తే బాగుండేది.

చివ‌రిగా: ఈ దెయ్యం బాగానే న‌వ్విస్తుంది

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts