ఐటం గాళ్ చేసేస్తారని భయపడుతున్న హీరోయిన్

0

poorna-hot-wallpaper03మలయాళంలో ఇప్పుడు పూర్ణకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుందట. కొన్నాళ్ల క్రితం ఓ మూవీలో ఐటం సాంగ్ చేసిన ఈ అందాల భామకు.. ఇప్పుడు ఐటం సాంగ్స్ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. రెగ్యులర్ క్యారెక్టర్స్ కంటే ఐటం సాంగ్స్ అవకాశాలే ఎక్కువగా వస్తుండటంతో.. అమ్మడికి ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఒక్క సినిమాలో ఐటం స్టెప్పులు వేస్తేనే పరిస్థితి ఇలా ఉంటే.. మరో రెండు సినిమాల్లో ఇలాంటి పాటలు చేస్తే.. తనను పూర్తిగా ఐటం గాళ్ ను చేసేస్తారని టెన్షన్ పడుతోందట పూర్ణ. అందుకే అలాంటి ఆఫర్లకు నో చెబుతోందట. అయితే తెలుగులోనూ మహేశ్ బాబు సరసన ఐటం సాంగ్ లో స్టెప్పులేయనున్న పూర్ణకు.. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమో అని ఫిలింనగర్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఒకవేళ అదే జరిగితే.. ఈ కేరళ కుట్టి ఏం చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఇప్పటికే హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న పూర్ణ.. ఐటం బ్యూటీగా పాపులర్ అవ్వడం కూడా పెద్ద విషయమే అవుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారట. మొత్తానికి హీరోయిన్ ఆఫర్లు లేక సతమతమవుతున్న పూర్ణకు కొత్త కష్టమే వచ్చిపడింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts