అందరిలా నేనుండలేను అంటున్న తార

0

Sonam Kapoor revealed her tattoos and piercingనిజమే మరి.. ఎవరూ ఇంకోలా ఉండటానికి ఇష్టపడరు. ఎవరికి వారే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెఃచ్‌కకోవడానికీతెచ్చుకోవడానికి ఇష్టపడతారు…అందుకోసం ఎంతైనా కష్టపడతారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఐతే, ఎవరికి వారే తమదైన ముద్రని వేయడానికి తహతహలాడుతుంటారు. అందుకే, ఏ హీరోనైనా- హీరోయిన్ ని అయినా మరొకరితో పోల్చితే ఒంటికాలు మీద అంతెత్తున లేస్తారు. అదే కోవకి అందాల బాలీవుడ్ నటి, సోనమ్ కపూర్ కూడా చెందుతుంది.

మొదటి రెండుమూడు సినిమాలకే నటిగా సోనమ్ కపూర్ సత్తా ఏంటో జనానికి అర్థమైపోయింది. బాలీవుడ్ తెరకు ఓ మంచి నటి దొరికిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సావరియా, ఢిల్లీ-6, రాన్‌జనా, భాగ్ మిల్కా భాగ్ చిత్రాలు ఆమెకు బాలీవుడ్‌లో సముచిత స్థానాన్ని కట్టబెట్టాయి. కానీ… తన కెరీర్ పరంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సోనమ్ ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో తన మనోభావాలని పంచుకుంది.
‘‘ ‘నీకు దక్కాల్సిన స్థానం దక్కలేదు’ అని చాలామంది దర్శకులు నాతో అంటుంటారు. నేను కూడా ఆ మాటకు ఏకీభవిస్తా. ఎందుకంటే, అందరు కథానాయికల్లాగా నేను ఉండలేను. చివరకు నేను ధరించే దుస్తులు కూడా నాలోని నటిని ప్రభావితం చేసేలా ఉండవ్. నాకు సరైన స్థానం దక్కకపోవడానికి ఈ స్వభావమే కారణం. అయితే… దేనికోసమో నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం నాకు నచ్చదు’’అని తేల్చి చెప్పేసింది సోనమ్.

నటిగా విభిన్నమైన పాత్రలు పోషించాలనే కోరిక… అందుకు తగ్గ ప్రతిభ తనలో ఉన్నాయని, అయితే… దర్శక, నిర్మాతలకే ఆ విషయం అర్థం కావడంలేదనీ సోనమ్ వాపోయారు. ‘‘ప్రస్తుతం మా సొంత సంస్థలో నేను నటించిన ‘ఖూబ్‌సూరత్’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూసున్నా’’ అని చెప్పారు సోనమ్. 1980లో ప్రఖ్యాత దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖూబ్ సూరత్’ చిత్రానికి రీమేక్‌గా ఈ ‘ఖూబ్‌సూరత్’ని తెరకెక్కించారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుదలైన అక్షర అహా నా పెళ్లంట కవర్ వీడియో సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి అందరి ప్రశంసలు అందుకున్న అక్షర గురించి ప్రత్యేక పరచయం అక్క...
Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
powered by RelatedPosts