ఆ సినిమా నన్ను నిలబెట్టింది అంటున్న హీరో

0

Sivajis-speech-on-youtube-this-weekఅతనో ఆటలో అరటిపండు లాంటి హీరో. అదేంటి, అలా అనేశాం అనుకుంటున్నారా? నిజమే మరి. సినిమాలు చేస్తున్న వాడు చేస్తున్నట్టే ఉన్నాడు కానీ అతనో పెద్ద పొడిచేసే సెలెబ్రిటీ కాదు. కాదు అనడం కంటే, కాలేకపోయాడు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరిన నటుదు అయి ఉండీ, ఏ పూటకి ఆ పూట అవకాశాల కోసం చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా గత ఏడెళ్లుగా అని చెప్పొచ్చు. ఆ హీరో శివాజీ. ఇక ఇక్కడ లాభం లేదు ,సినిమాలని వదిలేద్దాం అని అనుకుంటున్న దశలో “బూచమ్మ- బూచోడు” సినిమా పడింది. దాంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

సోమవారం రాత్రి రామవరప్పాడులోని కె-హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూచమ్మ-బూచోడు సినిమా మంచి హిట్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా తనకు మంచి సినిమాలు లేని నేపథ్యంలో ఈ చిత్రం తనను పరిశ్రమలో నిలబెట్టిందని పేర్కొన్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కృష్ణాజిల్లాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలయ్యాయని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు, జిల్లా వాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నిర్మాత రవిచంద్ పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts