గొప్పలు చెప్పుకోవడం మాకు అలవాటు లేదు: జయసుధ

0

Jayasudha Panel Press Meet About MAA Elections Photos (3)ఏ రంగంలో అయినా కొందరు కొద్దిగా ఘంత సాధించగానే మేము అది చేశాం, ఇది చేశాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నలభై మూడేళ్ళ నుండి నేను సినీ పరిశ్రమలో సాధించిన ఘనతాలెన్నో, పొందిన అవార్డులు ఎన్నో చెప్పుకోదలుచుకుంటే నా చరిత్ర తక్కువదేమీ కాదు. కాకపోతే నాకు అలా గొప్పలకి పోయే అవసరం, అలవాటు రెండూ లేవు. నా గురించి , నేను సాధించిన ఘనత గురించి ప్రజలకి తెలుసు, సినీ అభిమానులకి తెలుసు. రాజేంద్రప్రసాద్ వర్గం నన్ను డమ్మీ క్యాండిడేట్ అంటున్నారు. నిజంగా నేను డమ్మీనె అయి ఉంటే, ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఇంత సక్సెస్‌ఫుల్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఈ స్థాయికి వచ్చే అవకాశమే లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ వర్గం వాళ్ళు మా మీద, మేము వాళ్ళ మీద బురదజల్లుకునె ప్రక్రియకి మేము ఇక్కడితో ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే, నన్ను ఎంతమంది ఛానెల్ వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ కి వచ్చి మాట్లాడమని పిలుస్తున్నా వెళ్ళకుండా ఉన్నాను. నేను కూడా కౌంటర్లు ఇవ్వడం మొదలుపెడితే వేరెవరికీ మాట్లాడటానికి నోట మాట కూడా రాదు. కాబట్టి మా మౌునాన్ని మా చేతకానితనంగా ఎవరూ భావించరాదని మనవి చేసుకుంటున్నాను.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts