అబ్బే …అలాంటిదేమీ లేదంటున్న భామ

0

Mahira-Khan-Fashion-Sense-In-TUC-The-Lighter-Side-of-Life-71పుకార్లు పుట్టే క్రమం ఎలా ఉంటుందో నిజంగా ఎవరికీ తెలియదు. అందుకే, ఎప్పుడు ఎలాంటి వార్తలు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా బయటకు వస్తాయో అన్నది ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. సరిగ్గా అలాంటిదే ఇది అని చెప్పవచ్చు. ప్రముఖ పాకిస్తానీ మోడెల్,నటి మహిరా ఖాన్ “హమ్‌సఫర్” అనే సూపర్‌హిట్ సీరియల్ ద్వారా పాకిస్థాన్ లో బాగా పాపులర్ అయింది. త్వరలో ఆ సీరియల్ భారతదేశంలో టెలికాస్ట్ కానుంది. ఇదిలా ఉండగా, తను బాలీవుడ్‌లో హీరో రణవీర్‌సింగ్‌తో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని పాకిస్థానీ నటి మహిరా ఖాన్ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో పాకిస్థాన్‌కు చెందిన కరాచీ నగరం నుంచి మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తన అరంగేంట్రం రణవీర్ సింగ్‌తో ఉంటుందన్న వార్తలను కొట్టిపారేసింది. తనకు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్న మాట వాస్తవమే అయినా ఇప్పటివరకు ఏ హిందీ సినిమానూ తాను అంగీకరించలేదని చెప్పింది.

‘అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడ పుడతాయో అర్థం కావడంలేదు.. పేపర్లలోనే కాక ఆన్‌లైన్‌లోనూ వస్తున్న ఇటువంటి పుకార్లను చూసి చాలా బాధపడుతున్నా.. నాకు బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చినా వాటిలో నా మనసును తాకిన కథ ఒక్కటి కూడా లేదు.. అందుకే ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాకూ సంతకం పెట్టలేదు..’ అని నొక్కిచెప్పింది. కాగా, భారత్ సినిమాల్లో అరంగేంట్రం చేసేందుకు ‘హమ్‌సఫర్’లో తనతోపాటు నటించిన ఫవద్ ఖాన్ సహాయసహకారాలు తీసుకుంటానని ఆమె చెప్పింది.

తనకు భారత్‌లో పనిచేయాలని ఉందని, అయితే దానికి తగిన పాత్ర లభించాల్సి ఉందని తెలిపింది.‘ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన ‘ఖూబ్‌సూరత్’ సినిమాలో నటించిన ఫవద్ ఖాన్ నటనకు బాగానే మార్కులు పడ్డాయి. అతడికి భారతదేశంలో అభిమానులు పెరిగారు.. అతడిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది.. భారత్ సినిమా రంగంలో ఎలా మసలుకోవాలో ఫవద్ చాలా బాగా వంటబట్టించుకున్నాడు.. ఇంతకు ముందు పాకిస్థాన్‌లో ఎప్పుడూ ఇలా ఇంటర్వ్యూలకు అతడు హాజరయినట్లు నాకు గుర్తులేదు.. భారత్‌లో మాత్రం ఒకేరోజు చాలా ఇంటర్వ్యూల్లో కనిపించాడు.. ’ అని మహిరా పేర్కొంది

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts