అమ్మడికి అదో సరదా మరి…!!

0

alia bhattముచ్చటగా నాలుగే సినిమాలతో తారాపతానికి దూసుకువెళ్లిన హీరోయిన్ బాలీవుడ్ మొత్తంలో ఎవరైనా ఉన్నారా అంటే ,అందరూ టక్కున “ఆలియా భట్” పేరే చెబుతారు. నిజమే మరి… ఈ ముద్దుగుమ్మ ఇప్పటిదాకా చేసిన ” స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్”, “హైవే”, “టూ స్టేట్స్”మరియు ” హంప్టీ శర్మ కి దుల్హనియా” చిత్రాలు ఆలియా కి ఎక్కడలేని పేరు ప్రఖ్యాతులూ తెచ్చి పెట్టాయి. ఎంతోమంది దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఆలియా వెంటపడుతున్నారు. అంత స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నా, అమ్మడిలో ఇంకా ఆ చిన్నతనపు ఛాయలు పోలేదు.

వర్షం పడుతోందంటే చాలు.. వెంటనే బయటకు వెళ్లిపోయి పూర్తిగా తడిస్తే గానీ తనకు తృప్తి ఉండదని చెబుతోంది. అంతేకాదు.. ఇలా తడుస్తుండగా ఫొటో తీయించుకుని, వాటిని ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసింది. బయట వర్షం కుంభవృష్టిగా కురుస్తోందని దానికి కామెంట్ పెట్టింది. టైట్ ఫిటింగ్ జీన్స్ వేసుకుని, జుట్టు ముడేసుకుని మరీ ఈ వర్షంలో ఆమె తడిసింది.

ఇన్ స్టాగ్రామ్ లో ఆలియా ఈమధ్య బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది. కరీనా కపూర్ కు పెద్ద ఫ్యాన్ అయిన ఆమె.. తన అభిమానాన్ని తెగ చాటుకుంటోంది. ఇటీవలే విడుదలైన ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’ చిత్రంలో కూడా ‘లెహంగా పెహనూంగీతో సిర్ఫ్ కరీనా వాలా డిజైనర్ లెహంగా’ అని చెబుతుంది. రీల్ లైఫ్ లో అయినా, రియల్ లైఫ్ లో అయినా ఆమే తన అభిమాన హీరోయిన్ అని ఆలియాభట్ చెప్పింది.

అంతలా అభిమానించే కరీణాతో కలిసి నటించే ఛాన్స్ కనుక వస్తే ఇక ఆలియాని ఆపతరమా అంటూ బాలీవుడ్ లో జోకులు వేసుకుంటున్నారు జనాలు. అదీ నిజమే మరి…!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts