అమ్మడిని అవకాశాలు ముంచెత్తుతున్నాయి

0

gorgeous-amy-jacksonతెల్లదొరల దేశం నుండి(లండన్) నుండి దిగి వచ్చిన తెల్లతోలు పాప ఏమీ జాక్సన్ కి అదృష్టం ఆముదం పట్టినట్టు పట్టింది. అటు విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో కూడా కాదు – లేదు అనకుండా కానిచ్చేస్తోంది…అదే, నటించేస్తోంది. ఈ లక్షణమే ఈ ముద్దుగుమ్మ కి ఇప్పుడు ఉదయ్ నిధి స్టాలిన్ సినిమాలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మదరాసుపట్టణంతో తమిళ చిత్ర రం గంలో ప్రవేశించిన ఈ అమ్మడు ఆ తరువాత విక్రమ్‌తో తాండవం చిత్రంలో జోడీకట్టింది. మధ్యలో ఏక్ దివానా తా (నీదానే ఎన్ పొన్ వసంతం చిత్రానికి రీమేక్)తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అక్కడ ఆ చిత్రం ఢమాల్ అవడంతో మళ్లీ కోలీవుడ్‌కు వచ్చింది. తమిళ పరిశ్రమ ఈ ముద్దుగుమ్మను అందలం ఎక్కించేస్తోంది. తాండవం తరువాత మరో సారి విక్రమ్‌తో ఐ చిత్రంలో నటించింది.

స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఎమి జాక్సన్ ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషపడిపోయింది. ఈ చిత్రం విడుదల కాకుండానే అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సూర్యకు జంటగా మాస్ చిత్రంలో నటిస్తున్న ఎమికి ఉదయనిధి స్టాలిన్ ఆఫర్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎమిజాక్సన్‌తో డ్యూయెట్లు పాడనున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రానికి కెత్తు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ ముద్దుగుమ్మ కూడా కొన్ని సెకండ్ గ్రేడ్ హీరోల చిత్రాలను కూడా కాదని ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్ చేయడానికి సై అందట. ఇందుకు మరో కారణం కూడా ఉందట. ఈ పరదేశీ బ్యూటీ అడిగిన పారితోషికం చెల్లించడానికి ఉదయనిధి స్టాలిన్ వెంటనే ఓకే అనడంతో ఎమిజాక్సన్ ఆయనతో నటించడానికి ఎస్ అన్నారని కోలీవుడ్ టాక్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts