గుండు హనుమంత‌రావు క‌న్నుమూత‌

0

హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గతకొంతకాలంగా మూత్రం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇటీవల గుండు హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది.

గుండు హనుమంతరావు 1956, అక్టోబర్‌ 10న విజయవాడలో జన్మించారు. ‘సత్యాగ్రహం’చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు.‘అహ నాపెళ్లంట’ మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బిరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం, క్రిమినల్‌, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భత నటన కనబర్చారు. ఇక బుల్లితెరపై ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సీరియల్‌కు గాను ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీదేవి భౌతిక కాయానికి గ్రీన్ సిగ్నెల్
దుబాయ్‌లో కన్నుమూసిన శ్రీదేవి భౌతిక కాయం భారత్‌కు అప్పగింతలో కీలక ముందడుగు పడింది. ఆమె భౌతికకాయం అప్పగింతలో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరది...
దిగిరాక‌పోతే రిటైర్మెంట్ త‌ప్ప‌దు
ఇటీవ‌లే  చిత్ర పరిశ్రమపై 28శాతం జీఎస్టీ పన్ను విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే  ఈ విధానంపై విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న...
మెగాస్టారా..మ‌జాకా!!
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమాతో మ‌ళ్లీ రింగ్ లోకి దిగుపోయారు. నేడు సినిమా తెలుగు ప్రేక్షకాభిమానుల‌కు ముం...
powered by RelatedPosts