ద‌ర్శ‌కుడు మారుతి చేతుల మీదుగా `గ‌ల్ఫ్` చిత్రం  ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

0
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం  `గల్ఫ్`. ప్రవీణ్ ఇమ్మ‌డి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.   ద‌ర్శ‌కుడు మారుతి సీడీల‌ను రిలీజ్ చేసి యూనిట్ స‌భ్యుల‌కు అంద‌జేశారు.
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ` – “సునీల్‌కుమార్ రెడ్డిగారు గ‌ల్ఫ్ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌నేది సినిమా చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. స‌మాజం చుట్టూ జ‌రిగే స‌మ‌స్య‌లే ఆయ‌న క‌థా వ‌స్తువులు. వాటిని వాస్త‌వానికి అద్దం ప‌ట్టేలా చ‌క్క‌గా తెర‌కెక్కిస్తారు. అలాంటి వ్య‌క్తి  మ‌న ఇండ‌స్ట్రీలో ఉండ‌టం  గ‌ర్వ‌కార‌ణం. రామ్‌కుమార్ వంటి ఓ మంచి వ్య‌క్తి సునీల్‌కుమార్‌గారికి తోడ‌య్యారు. ప్ర‌వీణ్ ఇమ్మ‌డి సంగీతం బావుంది. గ‌ల్ఫ్ సినిమా ఓ ప‌దేళ్ళ పాటు గుర్తుండే పోయేలా ఉంటుంద‌ని భావిస్తున్నాను. ఇక‌పై  గ‌ల్ఫ్ గురించి మాట్లాడాలంటే ముందు ఈ సినిమానే గుర్తొస్తుంది.  రేపు ఎవ‌రైనా గ‌ల్ఫ్ వెళ్లాల‌నుకున్నా?  ఈ సినిమా అలాంటి వాళ్ల‌కు ఓ ఉదాహ‌ర‌ణ‌గా ఉంటుంది` అని అన్నారు.
ప్ర‌వీణ్ ఇమ్మ‌డి మాట్లాడుతూ – “సినిమాలో మంచి మ్యూజిక్ కుదిరింది. త‌ప్ప‌కుండా సంగీతం అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. సినిమాను అంద‌రూ పెద్ద హిట్ చేయాలి“ అన్నారు.
సినిమాటోగ్రాఫ‌ర్ మాట్లాడుతూ – “ ఈ  క‌థ కోసం గ‌ల్ఫ్ దేశాలు స‌హా తెలంగాణ‌లోని కొన్ని జిల్లాలు, రాయ‌ల‌సీమ‌, ఆంధ్రాల్లోని కొన్ని ప్రాంతాల‌ను సునీల్ గారు ప‌ర్య‌టించి స్ట‌డీ చేశారు.  రెండేళ్ల పాటు క‌థ‌పై రీసెర్చ్ చేశారు. అంద‌రినీ మెప్పించే సినిమా అవుతుంది“ అన్నారు.
నాగినీడు మాట్లాడుతూ – “సాంగ్స్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. సునీల్‌కుమార్‌గారు ఇలాంటి మంచి సినిమాలు మ‌రిన్ని చేయాలి. అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే సినిమా ఇది“ అన్నారు.
ఎల్‌.బి.శ్రీరాం మాట్లాడుతూ – “నాకు నాలుగు నంది అవార్డులు వ‌స్తే, అందులో రెండు అవార్డులు సునీల్‌కుమార్‌గారు చేసిన సొంతూరు సినిమాకు వ‌చ్చిన నందులే. సునీల్‌గారితో మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకోసం ఆయ‌న రెండేళ్లు క‌ష్ట‌ప‌డి. ఆ క‌ష్ట‌న్నంతా రెండున్న‌ర గంట‌ల సినిమాగా రూపొందించారు“ అన్నారు.
ఎం.ఎస్‌.రామ్‌కుమార్ మాట్లాడుతూ – “సునీల్‌కుమార్‌గారు గ‌ల్ఫ్ పై ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాన‌ని చెప్పారు. క‌చ్చితంగా మంచి సినిమా అవుతుంద‌నిపించింది. రెండేళ్ల‌పాటు సునీల్‌గారు అన్ని ప్రాంతాలు తిరిగి గ‌ల్ఫ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రించారు. అన్ని ఎమోష‌న్స్‌తో పాటు,  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయి“ అన్నారు.
నిర్మాత య‌క్క‌లి ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ – “సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.
హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ – “సునీల్‌కుమార్‌గారు న‌న్ను ఓ తండ్రిలా ముందుండి న‌డిపించారు. ఈ సినిమాలో నేను ల‌క్ష్మి అనే గోదావ‌రి జిల్లా అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. ఇలాంటి ఓ సినిమా చేయ‌డాన్ని గ‌ర్వ‌ప‌డ‌తాను“ అన్నారు.
హీరోయిన్ చేత‌న్ మ‌ద్ధినేని మాట్లాడుతూ – “ఈ క‌థ‌ను న‌మ్మి సునీల్‌గారు రెండేళ్ల పాటు క‌ష్ట‌ప‌డ్డారు. నా త‌ల్లిదండ్రులు కూడా నాకెంతో స‌పోర్ట్ చేశారు. మంచి ఎమోష‌న్స్‌, స్టోరీ, ఫైట్స్ అన్నీ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్‌ను ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.
ద‌ర్శ‌కుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ – “ఈ సినిమా ప్ర‌యాణంలో నా మిత్రులు, చిత్ర యూనిట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశాం. పాట‌లు అంద‌రికీ న‌చ్చుతాయి. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్యేలే  ఈ సినిమా. స‌హ‌కారం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌“ అన్నారు.
ఇత‌ర పాత్ర‌ల్లో చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిరి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్ న‌టిస్తున్నారు.
కెమెరా : యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్, రాజా, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్ . రామ్ కమార్ (USA), స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
powered by RelatedPosts