ఈ గౌత‌మ్ స్టైలిష్ గా క‌నిపిస్తాడు:  గోపీ చంద్

0
యాక్ష‌న్ కింగ్ గోపీ చంద్ క‌థానాయ‌కుడిగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `గౌత‌మ్ నంద`. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈ నెల 28న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ..
నా చివరి చిత్రం వచ్చి ఏడాదికి పైగా దాటిపోతుంది. అయితే ఈ చిత్రం విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నా. ఈ చిత్రం మరల నాకు మంచి విజయం అందించడంతో పాటు కెరియర్ కి బూస్ట్ ఇస్తుంది. ఇందులో  నా పాత్ర పేరు ఘట్టమనేని గౌతమ్. అయితే ఓ మామూలు గౌతమ్, గౌతమ్ నందగా ఎందుకు మారాడు అనే విషయం కథలో తెలుస్తుంది. సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపిస్తాను. ఇప్పటికె నా లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. సంపత్ నంది సెట్ లో చాలా క్లియర్ గా ఉంటాడు. అతనికి ఎలాంటి వేరియేషన్స్ కావాలో అడిగి మరి చేయించుకుంటాడు. అతను నాకు కథ చెప్పిన దానికంటే చాలా గొప్పగా ఇందులో అతని ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే గౌతమ్ నందా అతని కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే మించిపోయింది అని వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదు. రిలీజ్ కి ముందే నిర్మాతలకి టేబుల్ ప్రాఫిట్ రూపంలో అంతా వచ్చేసింది. ఇక ఈ సినిమా పంపిణీ దారులకి కూడా లాభాలు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నా. ఆక్షిజన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం నాకు తెలుయదు. ఇప్పటికి సినిమాలో కొత్త భాగం షూటింగ్ చేయాల్సి ఉంది. ఆ సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది అనేది మీలాగే నేను కూడా రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్. యువత డ్రగ్స్ కి బానిస అయిన విషయం తెలుసుకొని అందరి లాగే నేను కూడా చాలా బాధపడ్డ. అయితే సినిమా ఇండస్ట్రీ మీద అందరు ఎక్కువ ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అసలు ఈ డ్రగ్స్ ర్యాకెట్ ని మూలాల నుంచి పెకలించడానికి పాఠశాలల మీద కూడా ప్రభుత్వం ద్రుష్టి పెడుతుందని అనుకుంటున్నా` అని అన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
తెల్లకాగితంలా థియేటర్‌కి రండి..మంచి సినిమా చూడండి: సుకుమార్
ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలోవరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కా...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
powered by RelatedPosts