`గౌత‌మ్ నంద` రివ్యూ

0
2.5 Awesome
  • MAA Stars Rating 2.5
  • User Ratings (0 Votes)
    0

మాస్టార్స్.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : సంపత్ నంది
నిర్మాత : జె. భగవాన్, జె. పుల్లారావ్
సంగీతం : థమన్
నటీనటులు : గోపీచంద్, హన్సిక, క్యాథరిన్ థ్రెస

ముందుమాట‌:
`లౌక్యం` త‌ర్వాత గోపీచంద్ కు స‌రైన స‌క్సెస్ ల్లేవ్. జిల్, సౌఖ్యం చిత్రాలు డివైడ్ టాక్ తో తేలిపోయాయి. అటు మొద‌లైన సినిమాలు మ‌ధ్య‌లో అవాంత‌రాలు ఎదుర‌వ్వ‌డంతో గోపీ చంద్ పై తీవ్ర ప్ర‌భావ‌మే ప‌డింది. దీంతో ఈ హీరో కెరీర్ కాస్త స్లో అయిన‌ట్లు అనిపించింది. ఇప్పుడు స‌క్సెస్ అనివార్య‌మైంది. మ‌రి ఆ స‌క్సెస్ ను నేడు విడుద‌లైన `గౌత‌మ్ నంద` ఎంత వ‌ర‌కూ ఇస్తుందో? చూద్దాం..

క‌థ‌:
గౌత‌మ్ (గోపీచంద్) బాగా ధ‌న‌వంతుడు. డ‌బ్బు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలియ‌ని వ్య‌క్తి. నిత్యం సుఖాల్లో మునిగితేలుతుంటాడు. అయితే ఓ సంఘ‌ట‌న గౌత‌మ్ లో మార్పు తీసుకొస్తుంది. అస‌లు తానెవ‌రో తెలుసుకోవ‌ల‌న్న కోరిక పుడుతుంది. దీంతో గౌత‌మ్ సుఖాల్ని వ‌దిలేసి క‌ష్టాల‌ను వెతుక్కుంటూ వెళ‌తాడు. ఆ స‌మ‌యంలో గ‌త‌మ్ పోలిక‌ల‌తో మ‌రొక‌రు తార‌స‌ప‌డ‌తాడు. అత‌ను ఎవ‌రు? గౌత‌మ్ అక్క‌డ నుంచి త‌న జీవితాన్ని ఎలా ప్రారంభించాడు? ఈ జ‌ర్నీలో అత‌నికి ఎదురైన అనుభ‌వాలేంటి? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాల‌సిస్:
సంప‌త్ నంది క‌థ‌ల్లో చిన్న ఇన్నోవేటివ్ థాటు ను తీసుకుని దానికి త‌న‌దైన క‌మ‌ర్శియాలిటీని అద్ద‌డంలో దిట్ట‌. ఈ సినిమా కూడా అలాంటిదే. ఒక‌రు పాత్ర‌ల్లో కి మ‌రోక‌రు వెళ్ల‌డం అనే కాన్సెప్ట్ పాత‌దే. అయితే త‌న స్టైల్లో చిత్రాన్ని క‌మ‌ర్శియ‌ల్ చేశాడు సంప‌త్ నంది. తెలుగు ఆడియ‌న్స్ ప‌ల్సు ప‌ట్టుకుని ఎమెషన్స్ ను ట‌చ్ చేస్తూ తెర‌కెక్కించాడు. దాని చుట్టు గౌత‌మ్ నంద క్యారెక్ట‌ర్ ను కాస్త స్టైలిష్ గా ఎలివేట్ చేశాడు. ఆ క్యారెక్ట‌ర్ ను ఇంట‌ర్ డ్యూస్ విధానం కోసం బాగుంది. తొలిభాగ‌మంతా అలా సోసో గా సాగిపోతుంది. ద్వితియార్థంలో వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రిస్తాయి. అలాగే ప‌ర‌మ రోటీన్ ఎమోష‌న్స్ తో కాస్త విసుగు పుట్టిస్తాయి. అవి మాత్రం ప‌ర‌మ రోటీన్ గా ష‌రా మాములుగా ఉన్నాయి. అవి అంత‌గా పండ‌లేదు. చివ‌ర్లో వ‌చ్చే ట్విట్స్ బాగున్నాయి. అయితే కొన్ని అర్ధం లేని లాజిక్ లు కూడా ఉన్నాయి. సినిమా నెమ్మ‌దిగా సాగ‌డంతో బోర్ ఫీల్ అవుతాం. ఇంత మంచి పాయింట్ ను క‌మ‌ర్శియ‌ల్ చేయ‌డం జీర్ణించుకోవ‌డం క‌ష్టం. చ‌క్క‌టి పాయింట్ ను సెన్సుబుల్ గా డీల్ చేసి ఉంటే బాగుండేది. కానీ సంప‌త్ నంది కేవ‌లం వేరే కోణంలో సినిమా చేసిన‌ట్లే అనిపించింది. న‌టుడిగా గోపీచంద్ త‌న వ‌ర‌కూ న్యాయం చేసేశాడు. తెర‌పై స్టైలిష్ గా క‌నిపించాడు గానీ… అందులో కొత్తద‌నమేమి క‌నిపించ‌లేదు. పాట‌లు ష‌రా మాములుగా ఉన్నాయి. ఓవ‌రాల్ గా గౌత‌మ్ నంద అంటే సంప‌త్ స్టైల్ రొటీన్ సినిమా.

న‌టీన‌టులు:
గోపీచంద్ న‌ట‌న బాగుంది. లుక్ బాగుంది. కానీ కొత్తగా ట్రై చేస్తే ఇంకా బాగుండేది. అయితే తెర‌పై మాత్రం గోపీ వ‌య‌సు త‌గ్గిందా? అన్నంత అందంగా క‌నిపించాడు. గోపీ స్టైల్లో యాక్ష‌న్ సీన్స్ లో ఇర‌గ‌దీశాడు రొటీన్ గా. హీరోయిన్లు ఎందుకున్నారో అర్ధం కాదు. ఈ క‌థ‌కు వాళ్లు అవ‌స‌రం లేద‌నిపించింది. మిగ‌తా పాత్ర‌లు త‌మ ఫ‌రిది మేర న్యాయం చేసాయి.

సాంకేతిక వ‌ర్గం:
సంప‌త్ నంది రొటీన్ క‌థ‌నే కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న పాయింట్ బాగుంది..కానీ దాన్ని ఇంకా కొత్త‌గా చెబితే బాగుండేది. కెమెరా వ‌ర్క్ బాగుంది. సినిమాకు అదే హైలైట్. త‌మ‌న్ దంపుడు మ్యూజిక్ తో మ‌ళ్లీ దంచేసాడు. నిర్మాణ విలువ‌లు సోసోగా ఉన్నాయి.

చివ‌రిగా: ఈ గౌత‌మ్ నంద మ‌రీ రొటీన్ గా ఉన్నాడు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts