`ఫిదా` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

0

వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ఫిదా`. శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ‌క్తి కాంత్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం సాయంత్ర హైద‌రాబాద్ జెఆర్సీ క‌న్వెష‌న్ సెంట‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన ద‌ర్శ‌కులు సుకుమార్, వంశీ పైడిప‌ల్లి బిగ్ సీడీని ఆవిష్క‌రించారు. అనంత‌రం…

సుకుమార్ మాట్లాడుతూ, ` శేఖ‌ర్ సినిమాలు చాలా ల‌వ్లీగా ఉంటాయి. ఆయ‌న సినిమాల‌ను ఎక్కువ‌గా ప్రేమిస్తా. ఆయ‌న లా సినిమాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను గానీ ఆయ‌న లా మాత్రం చేయ‌లేను. ప్ర‌య‌త్నించిన ప్ర‌తీసారి నా టైమింగ్ లోకే వ‌చ్చేస్తాయి. ఇక నిర్మాత రాజుగారు జ‌డ్జిమెంట్ బాగుంటుంది. ఆయ‌న సినిమాలు స‌క్సెస్ కావ‌డంతో ఎంతో మందికి ఉపాది దొరుకుతుంది. అలాగే రాజుగారు ఎంతో మంది ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేశారు. న‌న్ను కూడా ఆయ‌నే ఇంట‌ర్ డ్యూస్ చేశారు. వ‌రుణ్ చిన్న‌ప్పుడే నాగ‌బాబు గారితో ప‌రిచ‌యం ఉంది. స‌డెన్ గా వ‌రుణ్ ఇప్పుడిలా చూస్తుంటే షాక్ అవుతున్నా. వ‌రుణ్ మంచి స్థానాల‌కు చేరుకోవాలి. మంచి భ‌విష్య‌త్ ఉంది. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ, ` శేఖ‌ర్ గారి సినిమాల‌ను ఎక్కువ‌గా ఫాలో అవుతుంటాను. ఆయ‌న ఆలోచ‌న‌లు చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. ప్ర‌తి సినిమా దేనిక‌దే డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఈ సినిమా కూడా లో ఏదో కూడా ఏదో కొత్త పాయింట్ ఉంటుంది. రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. ఇక వ‌రుణ్ తొలి సినిమా ముకుంద నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ డిఫ‌రెంట్ గా ఉండే సినిమాలే చేశారు. అలాగే సాయి ప‌ల్ల‌వి, త‌మిళ భాష లో బాగా పాపుల‌ర్ అయింది. ఈ సినిమాతో ఇక్క‌డ ఆడియ‌న్స్ ను కూడా ఫిదా చేస్తుంది. రాజు గారి విజ‌యాల ప‌రంప‌ర ఇలా కొన‌సాగుతూనే ఉంటుంది. ఈ సినిమా స‌క్సెస్ అయి ఆయ‌న‌కు మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.

హీరో వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ, ` శ‌క్తి నాకు మంచి ఆల్బ‌మ్ ఇచ్చాడు. మీనింగ్ ఫుల్ పాట‌లున్నాయి. శేఖ‌ర్ గారి సినిమాలు చాలా చూశాను. ఆయ‌న సినిమాల్లో హ్యూమ‌న్ ఎమోష‌న్స్ ఉంటాయి. షూటింగ్ స‌మ‌యంలో చిరాకుప‌డినా శేఖ‌ర్ గారి స్మైల్ చూసి కూల్ అయిపోయేవాడిని. దిల్ రాజు గారు మా ఫ్యామిలీ హీరోల‌తో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయ‌న‌తో నేను సినిమా చేయ‌డం చాలా హ్యీపీగా ఉంది. భానుమ‌తి పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి బాగా న‌టించింది. ఈ పాత్ర ఆమె కాక‌పోతే మ‌రొక‌రు చేయ‌లేరు. పెద‌నాన్న‌, చిన్నాన్న అభిమానులు కొన్ని జోన‌ర్ సినిమాలు చేయాల‌ని కోరారు. వాళ్ల కోరిక మేర‌కు నేను కూడా చేయ‌డ‌నాకి ప్ర‌య‌త్నిస్తా. ఆ విష‌యంలో నేను కూడా కొన్ని త‌ప్పులు చేశాను. నాకింత మంది అభిమానుల‌ను అందించినందుకు పెద‌నాన్న‌, బాబాయ్ కి కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

శేఖ‌ర్ క‌మ్ములా మాట్లాడుతూ, ` నా సినిమా విడుద‌లై చాలా కాలం అవుతోంది. దీంతో కొంచెం టెన్ష‌న్ గా ఉంది. ఫిదాం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. కానీ కార‌ణ‌ల వ‌ల్ల షూటింగ్ డిలే అయింది. కానీ సినిమా బాగా వ‌చ్చింది. పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. నా ప్ర‌తీ సినిమాలో స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ అంటారు. ఇది అలాంటింది. ఖుషీ, తొలి ప్రేమ గుర్తుకువ‌స్తుంది. ఇందులో సాయి ప‌ల్ల‌వి ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి ఫ్యాన్ గా న‌టించింది. ప‌ల్ల‌వి న‌ట‌న‌గా చాలా బాగుంటుంది. అందుకే ఆమె సౌత్ లో అంత పెద్ద స్టార్ అయింది. ముందు ముందు సినిమాల్లో ఇంకా బాగా చేస్తుంది. వ‌రుణ్ కొత్ లుక్ లో క‌నిపిస్తాడు. ఆయ‌న లో చిరు, నాగ‌బాబు, ప‌వ‌న్ అంద‌రూ క‌నిపిస్తారు. తొలి ప్రేమ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు ఎలా ఏడిపించారో ఫిదాలో వ‌రుణ్ కూడా అలాగే ఏడిపెట్టిస్తాడు. నా ముర్ఖ‌త్వానికి త‌ట్టుకుని శ‌క్తి మ్యూజిక్ అందించాడు` అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ` ఆనంద్ కాఫీ లాంటిదైతే.. ఫిదా ఖుషీ లాంట సినిమా అవుతుంది. హీరో ఎవ‌రంటే వ‌రుణ్ అని నేనే చెప్పా. ల‌వ్ స్టోరీలు అప్ క‌మింగ్ హీరోలు చేస్తే వ‌ర్కౌట్ అవుతుంది. అదే న‌మ్మే సినిమాలు చేస్తాను. ఇది నూటికి నూరుశాతం ప‌క్క శేఖ‌ర్ క‌మ్ములా ఫిల్మ్. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సినిమాలు ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ప్ర‌తీ సినిమాలో నా హ‌స్తం ఉంటుంది.కానీ శేఖ‌ర్ క‌మ్ములా విష‌యంలో మాత్రం ఇన్వాల్ కాలేదు. ఆనంద్, హ్యాపీడేస్ త‌ర్వ‌తా ఫిదా ఉంటుంది. సాయి ప‌ల్ల‌వి డ‌బ్బింగ్ సినిమాతోనే మ‌న ఆడియ‌న్స్ ను ఫిదా చేసింది. చిరంజీవిగారు ద్వారా ఆ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు అయ్యారు. వ‌రుణ్ కెరీర్ లో ఫిదా మంచి మూవీ అవుతుంది. అన్ని వ‌ర్గాల వారు చూడ‌ద‌గ్గ సినిమా ఇది. మా బ్యాన‌ర్ లో వ‌రుస‌గా మూడు విజ‌యాల‌తో హ్యీట్రిక్ అందుకున్నాం. ఈ నాల్గ‌వ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం` అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు శ‌క్తి కాంత్ మాట్లాడుతూ, ` ఇది నాకు చాలా పెద్ద అవ‌కాశం. శేఖ‌ర్ గారు టార్చ‌ర్ పెట్టి మ‌రీ ట్యూన్స్ రాబ‌ట్టుకున్నారు. పాటలు, సినిమా పెద్ద విజయం సాధించాలి` అని అన్నారు.
హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతూ, ` ఈ సినిమాతో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇందులో మంచి పాత్ర ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

ఈ వేడుక‌లో త్రినాధ‌రావు న‌క్కిన‌, స‌తీష్ వేగేశ్న‌, సీతార‌మ‌శాస్ర్తి, సుద్దాల అశో క్ తేజ‌, వ‌న‌మాలి, చైత‌న్య‌, అనీల్ రావిపూడి, విజ‌య్ కుమార్ ( సినిమాటోగ్ర‌ఫ‌ర్), రాజ‌వీ నాయ‌ర్, రాజా, హ‌ర్షిత్ రెడ్డి, సాయి చంద్, గీతా భాస్క‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts