ఫిదా రివ్యూ!

0
3.5 Awesome
  • MAA Stars Rating 3.5
  • User Ratings (3 Votes)
    7.9

Fidda  movie review

న‌టీన‌టులు: వ‌రుణ్‌తేజ్‌.. సాయిప‌ల్లవి.. రాజా.. సాయిచంద్‌.. శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌.. గీతా భాస్క‌ర్‌.. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే.. నాథన్ స్మేల్స్ త‌దిత‌రులు.
ఛాయాగ్ర‌హ‌ణం: విజ‌య్ సి.కుమార్‌
కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్
సంగీతం: శ‌క్తికాంత్‌
నిర్మాణం: దిల్‌రాజు, శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ క‌మ్ముల‌
సంస్థ‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
మాస్టార్స్.కామ్ రేటింగ్:3.5/5

ముందుమాట‌: మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఫిదా` సినిమా నేడు ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా క‌థాక‌మామీషు ఏంటో ఓసారి చూద్దాం.

క‌థ‌: వ‌రుణ్ (వ‌రుణ్ తేజ్) అన్న‌య్య పెళ్ళి సంబంధం కోసం అమెరికా నుంచి తెలంగాణ లోని బాన్సువాడ గ్రామానికి వ‌స్తారు. తొలి చూపులోనే అన్న‌య్య కు కాబోయే మ‌ర‌ద‌ల్ని భానుమ‌తి( సాయి ప‌ల్లవి) ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ వ‌రుణ్ క్లాస్…భానుమ‌తి మాస్. ప‌క్కా తెలంగాణ పిల్ల‌. అయినా వ‌రుణ్ త‌న‌నే పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. భానుమ‌తి కూడా వ‌రుణ్ ని ఇష్ట‌ప‌డుతుంది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల భానుమ‌తి వ‌రుణ్ ని దూరం పెడుతుంది. మ‌రి ఆ దూరం ఎందుకు వ‌చ్చింది? బాన్సువాడ‌లో భానుమ‌తి బిహేవియ‌ర్ ఎలా ఉంటుంది? చివ‌రికి ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాల‌సిస్:
ఇది శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ సినిమా. సున్నిత‌మైన క‌థ‌ను త‌నశైలి క్రియేటివిటీతో క్లాసిక్ గా చూపించాడు. వృత్తి రిత్యా అమెరికాలో డాక్ట‌ర్ అయిన వ‌రుణ్ అన్న‌య్య పెళ్లి కోసం బాన్సువాడ రావ‌డం అక్క‌డ తెలంగాణ అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌టం బాగుంది. తెలంగాణ యాస భాష‌లో సాయి ప‌ల్ల‌వి ఇర‌గ‌దీసింది. ఆ పాత్ర‌కు తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్ప‌డంతో ఆ పాత్ర‌కు మ‌రింత అందం వ‌చ్చింది. ప్ర‌ధ‌మార్థం అంతా దాదాపు బాన్సువాడ‌లోనే క‌థ స‌ర‌ద స‌ర‌దాగా క‌థ సాగుతుంది. అమెరికా నుంచి వ‌చ్చిన ఆంధ్రా అబ్బాయి…తెలంగాణ భాష‌ను నేర్పించ‌డం..చుట్టు ప‌చ్చ‌ని పోలాల మ‌ధ్య‌లో క‌థ బోర్ కొట్ట‌కుండా సాగిపోతుంది. అయితే లెంగ్త్ ఎక్కువ‌గా ఉండ‌టంతో కొంచెం బోర్ కొడుతుంది. కొన్ని సన్నివేశాల‌ను ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక ద్వితియార్థంలో ఇద్ద‌రి మ‌ధ్య పొర‌పొచ్చాలు రావ‌డంతో వ‌రుణ్ అమెరికా వెళ్లిపోవ‌డం. ప్రేమించిన అమ్మాయిని వ‌దులుకోలేక‌..అక్క‌డ వేసే వేషాలు అన్నీ స‌ర‌ద‌గా సాగిపోతాయి. ముఖ్యంగా భానుమ‌తి వ‌రుణ్ కు చెప్పు చూపించే స‌న్నివేశం హైలైట్ గా ఉంటుంది. ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయి స‌మాధానం ఎలా ఉంటుందో ఆ చెప్పు ప‌క్క‌గా చెబుతుంది. అండ‌ర్ క‌రెంట్ గా సాగే తండ్రీ కూతుళ్ల మ‌ధ్య అనుబంధాలు..ఎమోష‌న‌ల్ జ‌ర్నీ బాగుంది. త‌ల్లి కూతుళ్ల మ‌ధ్య తెలంగాణ స్టైల్ స‌ర‌దా స‌న్నివేశాలు బాగున్నాయి. ఓవ‌రాల్ గా ఫిదాకి కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మాత్రం త‌ప్పకుండా ఫిదా అవుతారు.

న‌టీన‌టులు: వ‌రుణ్ పాత్ర బాగుంది. చ‌క్క‌గా న‌టించాడు. ఇక సాయి ప‌ల్ల‌వి న‌ట‌న సినిమాకు ఆయువు ప‌ట్టు. ఆ పాత్ర‌ను ఊహించుకునే ద‌ర్శ‌కుడు క‌థ‌ను సిద్దం చేసిన‌ట్లు అనిపించింది. తెలంగాణ హైడ్రిడ్ పిల్ల సాయి ప‌ల్ల‌వి అద‌రగొట్టింద‌నే చెప్పొచ్చు. ఇక మిగ‌తా పాత్ర‌లు అన్నికూడా బాగా కుదిరాయి. స‌త్యం రాజేష్ కామెడీ బాగానే ఉంది.

సాంకేతిక వ‌ర్గం: పాత క‌థే అయినా శేఖ‌ర్ క‌మ్ముల ట్రీట్ మెంట్ కాబ‌ట్టి అందంగా అనిపించింది. కెమెరా వ‌ర్క్ బాగుంది. ఎడిటింగ్ లోపాలున్నాయి. కొన్ని స‌న్నివేశాల‌ను ట్రిమ్ చేస్తే నిడివి త‌గ్గుతుంది. ఇక సంగీతం బాగుంది. పాట‌ల‌న్నీ బాగున్నాయి. ఆర్ .ఆర్ శేఖ‌ర్ స్టైల్లో చ‌క్క‌గా ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

చివ‌రిగా: `ఫిదా` అవ్వాల్సిందే

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts