శ్రీదేవి భౌతిక కాయానికి గ్రీన్ సిగ్నెల్

0

దుబాయ్‌లో కన్నుమూసిన శ్రీదేవి భౌతిక కాయం భారత్‌కు అప్పగింతలో కీలక ముందడుగు పడింది. ఆమె భౌతికకాయం అప్పగింతలో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ పార్థివదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు దుబాయ్‌ పోలీసులు అంగీకరించారు. ఈ మేరకు భారత దౌత్యఅధికారులు, ఆమె కుటుంబ సభ్యులకు అనుమతి పత్రాలను దుబాయ్‌ పోలీసులు అందజేశారు. శ్రీదేవిది అసహజ మరణమని ఫోరెన్సిక్‌ నివేదిక తేల్చిన నేపథ్యంలో కేసు దర్యాప్తు ప్రారంభించిన దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ మృతదేహాన్ని అప్పగించేందుకు అనుమతి తెలిపింది.

దుబాయ్‌ పోలీసుల అనుమతి నేపథ్యంలో శ్రీదేవి పార్థివదేహాన్ని రసాయనిక శుద్ధి (ఎంబామింగ్‌) కోసం పంపించనున్నారు. ఈ ప్రకియ తర్వాత తదుపరి ప్రక్రియల్ని పూర్తిచేసి శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు తరలిస్తారని సమాచారం. మృతదేహం పాడవకుండా చేపట్టే రసాయన ప్రక్రియ(ఎంబామింగ్‌)తోపాటు ఇతర ప్రక్రియలు పూర్తికావడానికి సుమారు 3-4 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన శ్రీదేవి పార్థివదేహం ఈ రోజు రాత్రికి ముంబయికి చేరుకునే అవకాశం ఉంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అతిలోక సుంద‌రికి రంగ‌స్థ‌లం సాంగ్ అంకితం
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న`రంగ‌స్థ‌లం` తొలి పాట `ఎంత స‌క్క‌గున్నావే` సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కోటికి మంద...
దుబాయ్‌లో వేలానికి శ్రీదేవి వేసిన పెయింటింగ్‌
దివంగత నటి శ్రీదేవి లో మంచి నటే కాదు.. కళాకారిణి కూడా ఉంది. ఖాళీ సమయాల్లో ఆమె పెయింటింగ్‌లు వేస్తుంటారు. ఓసారి సోనమ్‌ నటించిన ‘సావరియా’ చిత్రంలోన...
శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేసిన దుబాయ్ పోలీసులు
శ్రీదేవి మృతి కేసులో విచారణ ముగిసిందని ఈ కేసును మూసివేస్తున్నట్లు దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. ‘ఈ కేసులో విచారణ ముగిసిందని దుబాయ్‌ పబ్లిక్‌ ప్ర...
powered by RelatedPosts