‘డ్రీమ్ బాయ్’ చిత్రం ప్రారంభం

0

రాజేష్ కనపర్తి దర్శకత్వంలో, రేణుక నరేంద్ర నిర్మాతగా మాస్టర్ ఎన్ టి రామ్ చరణ్ సమర్పణలో సెవన్ వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 గా తెరకెక్కనున్న చిత్రం ‘డ్రీమ్ బాయ్’. తేజ, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, మరో నిర్మాత ఏం వి రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ సన్నిధి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేష్ కనపర్తి మాట్లాడుతూ.. ఇదొక థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ప్రేమతో నిండిన క్యూట్ స్టోరీ ఇది. అలాగే సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. కొత్త, పాత నటీనటులతో ఈ చిత్రాన్ని లావిష్ గా తెరకెక్కించనున్నాం. ఆద్యంతం కామెడీతో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది..అన్నారు.

చిత్ర నిర్మాత రేణుక నరేంద్ర మాట్లాడుతూ.. మా డైరెక్టర్ రాజేష్ చెప్పిన కథ ఎంతో నచ్చింది. ఈ చిత్రం ఈ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పొందు పరచనున్నాం. ఈ చిత్రం మాకు, మా బ్యానర్ కు మంచి నేమ్ తెస్తుందని ఆశిస్తున్నాం.. అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
powered by RelatedPosts