అలా పిలవకండి…అవమానంగా ఉంది

0

ParineetiChopra1ఆడపిల్లల్ని ఎవరైనా బబ్లీ అంటే భలే ఆనందపడతారు. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ని ఎవరైనా అలా బబ్లీ అని పిలిస్తే నచ్చదట. పైగా తనని ఎవరైనా అలా పిలిస్తే అవమానంగా ఫీల్ అవుతా అని చెప్పుకొచ్చింది. ఎందుకు పరిణీతి ఈ ఆ పిలుపు అంటే అంత చిరాకు? అందులో అంత అవమానంగా ఫీల్ అవ్వాల్సిన పని ఏముంది అని తెలుసుకోవాలంటే మీరు ఇది చదవాల్సిందే…!!

‘బబ్లీ అని నన్ను పిలిస్తే నాకు అగౌరవంగా అనిపిస్తోంది. ఇప్పటికి ‘హసీ తో ఫసీ’, ‘ఇషక్‌జాదే, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘లేడీ వర్సెస్ రికీ బహెల్’’ అనే నాలుగు సినిమాల్లో నటించా. ఒక సినిమాతో మరో సినిమాకి ఎటువంటి పోలికలు లేవు. వాటిల్లో బబ్లీ అనిపించేవిధంగా ఏదీ లేదు. అలా నన్ను సంబోధించడం ఎద్దేవా చేసినట్టుగా అనిపిస్తోంది. అలా పిలిచేవాళ్లంతా మరో సారి నా సినిమాలన్నీ చూడాలి.ఆ సినిమాలన్నీ చూస్తే వారి అభిప్రాయంలో మార్పు వస్తుంది’ అని అంది.

కాగా తాజా సినిమా ‘దావత్-ఎ-ఇష్క్’ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న పరిణీతిచోప్రా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ సినిమాకు హబీబ్ ఫైజల్ దర్శకత్వం వహిస్తుండగా ఆదిత్యరాయ్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి సినిమాలోనూ విభిన్నంగా కనిపించేందుకు పరిణీతి తంటాలు పడుతోంది.అయితే ఈ రంగంలో తనకు ఎదురవుతున్న పోటీ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ‘సహ తారలు ఏయే సినిమాల్లో నటిస్తున్నారనే విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోను. గత సినిమాలో కంటే తాజా సినిమాలో విభిన్నంగా కనిపించడానికి మాత్రం ప్రయత్నిస్తా. ప్రతి కథానాయకుడు, కథానాయిక ఒకరికొకరు విభిన్నంగా ఉంటారు. మా అందరికీ విభిన్నమైన పనితీరు ఉంటుంది. అందువల్ల పోటీ పడాల్సిన అవసరమే లేదు.’ అని అంది.

ఈ సుందరి మీకు ఎక్కడైనా తారసపడితే మర్యాదగా పరిణీతి అని పిలవండి…. పుసుక్కున బబ్లీ అనేరు…..ఇక అంతే సంగతులు …!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts