డాక్టర్ చక్రవర్తి రివ్యూ

0

నటీనటులు : రిచర్డ్ రిషి , సోనియా మన్ , లీనా కుమార్ తదితరులు
సంగీతం : విజయ్ కూరాకుల
నిర్మాతలు : శేఖర్ సూరి , వెంకటేశ్వర్లు
దర్శకత్వం : శేఖర్ సూరి
మాస్టార్స్.రేటింగ్ : 2. 75/ 5

ముందుమాట‌: ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంతో స‌క్సెస్ తో టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు శేఖ‌ర్ సూరి. థ్రిల్ల‌ర్ సినిమాలను కొత్త పుంత్తలు తొక్కించిన ద‌ర్శ‌కుడు ఆయ‌నే అన‌డంలో ఏ మాత్రం అతి శ‌యోక్తి లేదు. తాజాగా మ‌రోసారి ముంబైలో జ‌రిగిన ఓ వాస్త‌వ సంఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని `డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి` అనే థ్రిల్ల‌ర్ సినిమా తెర‌కెక్కించారు. రిచర్డ్ రిషి , సోనియా మన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 14 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా క‌థా క‌మామీషు ఏంటో ఓసారి చూద్దాం.

కథ : సొసైటీ లో మంచి పేరు ప్రతిష్టలున్న డాక్టర్ చక్రవర్తి తన భార్య వందన కూతురు సోనియా కొడుకు రాహుల్ తో కలిసి ఆనందంగా గడుపుతుంటాడు . అయితే ఆసుపత్రి ని మరింతగా అభివృద్ధి చేయడానికి ధాత్రిక్ అనే మాఫియా డాన్ వ‌ద్ద 50 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంటాడు. అయితే సకాలంలో ఆ డబ్బు ని ధాత్రిక్ కు తిర‌గి చెల్లించ‌డం లో లేట్ అవ్వ‌డంతో అతడు డాక్టర్ చక్రవర్తి తో సహా అతడి కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తాడు . బెదిరింపుల‌కు తాళ‌లేక థాత్రిక్ చంపకముందే ఆ కుటుంబ‌మే ఆత్మహత్య చేసుకుందామని ఫామ్ హౌజ్ కు వెళ్తారు .అయితే అక్కడ అనూహ్యంగా ఓ చిన్న మ‌లుపు తిరుగుతుంది. ఆ మ‌లుపు ఏంటి? ఫామ్ హౌస్ కు వె ళ్లిన ఆ కుటుంబం ఆత్మ హ‌త్య చేసుకుందా? లేదా? ఆ ఫామ్ హౌస్ హిస్ట‌రీ ఏంటి? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాల‌సిస్: వాస్తవ సంఘ‌ట‌న‌ను బేస్ చేసుకుని సినిమా చేయ‌డంతో మంచి ఫీల్ క‌ల్గింది. స‌న్నివేశాలు రియ‌ల్ స్టిక్ గా ఉన్నాయి. క‌థ‌నాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంతో వాట్ నెక్స్ట్ అనేది దానిపై క్యూరియాసిటీ పెరిగింది. థ్రిల్ల‌ర్ అంశాలు బాగున్నాయి. తెర‌పై పాత్ర‌ల‌ను మ‌లిచిన తీరు చ‌క్క‌గా ఉంది. ఆడియ‌న్ కు క‌న్ఫ్యూజ‌న లేకుండా క‌థనాన్ని వివ‌రించ‌డం బాగుంది. ఓవ‌రాల్ గా థ్రిల్లర్ ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అవుతుంది.

నటీనటుల ప్రతిభ :

సోనియా మన్ గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాకుండా తన నటనతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసింది. రిచర్డ్ రిషి కి కూడా మంచి పాత్ర లభించింది . తెలుగువాళ్ళ ముందుకు మళ్ళీ చాలారోజుల తర్వాత వచ్చాడు రిషి . బేసిక్ గారిషీ ఇలాంటి పాత్ర‌ల్లో ఒదిగిపోతాడు. ఈ సినిమాకు త‌న న‌ట‌న పెద్ద అస్సెట్ అయింది. గిరీష్ సహదేవ్ , లీనా అభిషేక్ తమ ఫ‌ర‌ది మేర పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :
థ్రిల్లర్ కథ ను శేఖర్ సూరి చ‌క్క‌గా రాసుకున్నాడు. కథనాన్ని బాగా డీల్ చేశాడు. అయితే ఇంకాస్త గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది . చివరి సీన్ వరకు సస్పెన్స్ మెయింటేన్ చేసిన విధానం బాగానే ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ .. అలాగే క్లైమాక్స్ ని బాగా హ్యాండిల్ చేసాడు . నిర్మాణ విలువలు ఫరవాలేదు. కెమెరా ప‌నిత‌నం బాగుంది. విజయ్ కూరాకుల నేపథ్య సంగీతం సినిమాకి బాగా క‌లిసొచ్చింది.

చివ‌రిగా : ఈ చ‌క్ర‌వ‌ర్తి శేఖ‌ర్ సూరి మార్క్

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
powered by RelatedPosts