డర్టీ హీరోయిన్..డర్టీ పాలిటిక్స్

0

30-mallika-sherawatటీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ వంటి ప్రమోషన్ తో ఓపినింగ్స్ రప్పించాలి…ఓవర్ నైట్ లో బిజినెస్ జరిగిపోవాలి ఇదీ టాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు అనుసరిస్తున్న వ్యూహం. అందులో భాగంగా అవకాసం ఉంటే కాంట్రావర్శికి దిగుతున్నారు. ఇప్పుడు మల్లికా షెవారత్ పెట్టుకుని డర్టీ పాలిటిక్స్ సినిమా చేస్తున్నవారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా వారు విడుదల చేసిన పోస్టర్ అంతటా చర్చనీయాంశంగా మారింది. జాతీయ జెండాని అవమానిస్తున్నట్లు ఈ పోస్టర్ ఏ వివాదాలకు తెరతీస్తుందో అని బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మర్డర్ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన తార మల్లికా శరావత్. ఆ సినిమాలో మల్లికా అందాల ప్రదర్శన, ఘాటైన ముద్దు సీన్లు ఆమెకు ఎనలేని క్రేజ్ తేవడమే కాదు, అనతి కాలంలో ఊహించని పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ భాగానే సాగినా ప్రస్తుతం మాత్రం ఏమంత సంతృప్తి కరంగా లేదు. ఈ నేపధ్యంలో ఆమె కాంట్రావర్శి ఉన్న సబ్జెక్టులతో ముందుకు రావాలనే నిర్ణయం తీసుకుంది. మల్లిక …రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ‘భన్వరీదేవి’ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్‌ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించబోతోంది. గ్లామర్‌కి ఆస్కారం లేని పాత్రలో పిడకలు చేసుకొంటూ కెమెరా ముందు నటిస్తోంది. ఇక ఈ చిత్రం టైటిల్ ‘డర్టీ పాలిటిక్స్‌’. రాజస్థాన్‌లో రెండేళ్ల కిందట వెలుగుచూసిన భన్వరీదేవి ఉదంతం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కె.సి.బొకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరికి చెందిన గృహిణిగా మల్లిక పాత్ర ఉంటుంది. కొందరు రాజకీయ నాయకుల మూలంగా ఆమె జీవితం ఎలా ఇబ్బందులు పాలైందో చూపించబోతున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌న్నీలియోన్ నా..మ‌జాకా!
హీరోయిన్ల‌లో ఎవ‌రికైనా ఇంత ఫాలోయింగ్ ఉంటుందా? ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ఏ హీరోయిన్ కోస‌మైనా వ‌చ్చారా? అంటే ఇక‌పై ఠ‌క్కున గుర్తొచ్చే ఒకే ఒక...
బి..సీల్లో తేడాసింగ్ ర‌చ్చ ర‌చ్చే!
నంద‌మూరి న‌ట‌సింహాన్ని (బాల‌కృష్ణ‌) ఇప్ప‌టివ‌ర‌కూ ఒక యాంగిల్ లోనే చూశాం. ఇప్పుడు రెండ‌వ యాంగిల్ ను డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `పైస...
వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
powered by RelatedPosts