దర్శకుల వెంటపడే అలవాటు నాకు లేదు

0

Nandamuri_Balakrishnaఇంత నిక్కచ్చిగా మాట్లాడగలిగే దమ్ము సినీ పరిశ్రమలో ఎవరికి ఉండి ఉంటుంది చెప్పండి? అవును ..ఇంకెవరికి ఉంటుంది మరి…నందమూరి నట సింహం బాలకృష్ణకి కాకుండా….. అవునా? కొద్ది రోజుల క్రితం షూటింగులో ప్రమాదావశాత్తూ గాయపడ్డ బాలయ్య, ప్రస్తుతం కోలుకున్నాడు. ప్రమాదం జరిగిన తరువాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ,తన మనసులోని భావాలని మీడియాతో ఇలా పంచుకున్ననాడు.

ప్రతి సినిమాకు తనకు ఓ గాయం గుర్తుగా ఉంటుందని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన సోమవారం కాలికి గాయంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సినిమా షూటింగ్లో దెబ్బలు తగలడం మామూలేనన్నారు. ఇటీవల తనకు తగిలిన గాయానికి ఏడు కుట్లు పడ్డాయని, ఈరోజే కుట్లు విప్పారని తెలిపారు. వందో సినిమా గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని, తన వందో సినిమాపై అభిమానుల అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని బాలకృష్ణ అన్నారు.

తాను దర్శకుల వెంట పడనని, దర్శకులే తన వెంట పడాలని బాలకృష్ణ అన్నారు. వందో సినిమా ఫలానా దర్శకుడితో తీయాలేని లేదని లేదన్నారు. డైరెక్టర్ల వెంటపడే అలవాటు తనకు లేదని, రికార్డుల కోసం సినిమాలు బలవంతంగా ఆడించుకునే అలవాటు లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇటీవలి బైక్ రేసింగ్ చిత్రీకరణలో భాగంగా బాలకృష్ణ బైక్ మీద నుంచి పడిపోవటంతో కాలికి గాయం అయిన విషయం తెలిసిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts