భారీ హంగులతో ధనుష్ బాలీవుడ్ సినిమా

0

dhanushతమిళ సినీరంగంలో ధనుష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా, రజనీకాంత్ కి అల్లుడైన తరువాత ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. “కొలవేరీ” పాటతో ధనుష్ మొత్తం ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఆ ఒక్క పాత ధనుష్ ని బాలీవుడ్ లో కూడా క్రేజీ జీరోని చేసింది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రక్రియలో “రాంఝానే” చిత్రాన్ని తీసి, సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ అమితాబ్ బచ్చన్, అక్షర హాసన్ ల సరసన తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాడు.

వీరితోపాటు సినిమా రంగానికి చెందిన 9 మంది ప్రముఖులు ఈ సినిమాలో మెరవనున్నారు. ఈ సినిమాలో తన కాంటాక్ట్స్ అన్నీ వాడుకుని 6 దర్శకులను సినిమాలో ప్రత్యేక పాత్రలకు ఒప్పించాడు. రాజు హిరాని, గౌరీ షిండే, మహేష్ భట్, ఓం ప్రకాష్ మరియు అనురాగ్ బసులు తళుక్కున మెరవనున్నారు. జావేద్ అక్తర్, బోనీ కపూర్, ఏక్తా కపూర్ లు సైతం ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతదర్శకుడు. పి.సి శ్రీరాం సినిమాటోగ్రాఫర్.

నిర్మాణ దశలోనే ఇంతటి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ సినిమా పట్ల, సహజంగానే ఎన్నో ఆచనాలుంటాయి. వాటిని మరి ధనుష్ ఎలా అందుకుంటాడో వేచి చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts