"రుద్రమదేవి" తెరవెనుక కష్టాలు

0

rudramadeviటాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచిన వాటిల్లో “రుద్రమదేవి” కి కూడా స్థానం ఉంది. సెట్ల పితామహ గుణశేఖర్ దర్శకత్వంలోని మోస్ట్ అవేటింగ్ మూవీ”రుద్రమదేవి”. అందాల తార ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాళుక్య వీరభద్రుడిగా రానా ఫస్ట్ లుక్‌లోనే అభిమానుల మనసు దోచేసుకున్నారు. అందాల యువరాణిగా అనుష్కకు అంతటి దర్పాన్ని, అచ్చమైన రాజకుమారుడిగా రానాకి రాజఠీవిని తెచ్చిపెట్టింది ఏమిటి? కాస్ట్యూమ్స్. ఎస్… అదంతా ప్రముఖ డిజైనర్ నీతాలుల్లా క్రియేటివ్ మహిమ. ‘జోధా అక్బర్’లాంటి చరిత్రాత్మక చిత్రాలకు పనిచేసిన ఆమెతోపాటు మన హైదరాబాదీ విద్యార్థులూ తమ సృజనాత్మకతను పంచుకున్నారు. ఈ ప్రత్యేక దుస్తుల తయారీలో ఆమెకు సాయపడ్డ హ్యామ్స్‌టెక్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్స్ అపర్ణ, రవి వానమ్, రచనల ఎక్స్‌పీరియెన్స్ వారి మాటల్లోనే…

ఇది మాకు మొదటి చిత్రం. ఫస్ట్ మూవీలోనే లీడ్ యాక్టర్స్ కాస్ట్యూమ్స్‌కి అసిస్టెంట్‌గా పనిచేయడం సంతోషాన్నిస్తోంది. క్లాసులో నేర్చుకున్నది, ప్రాక్టికల్స్‌లో చేసినదానికంటే… ఆన్‌సెట్స్ ఎక్స్‌పీరిఎన్స్ కొత్తగా ఉంది. బాలీవుడ్‌లో స్థిరపడాలన్నది నా కోరిక.
– అపర్ణ

గతంలో రానా, ప్రకాష్‌రాజ్, కృష్ణంరాజు దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. కానీ రుద్రమదేవి స్పెషల్. రానా బాడీకి, సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా డిజైన్ చేశాం. రానా గెటప్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక అనుష్క ధరిస్తున్న ఒరిజినల్ బంగారు ఆభరణాలకు తగ్గట్టుగా డ్రెస్ కలర్స్ ఉండేవిధంగా శ్రద్ధ తీసుకున్నాం. కొత్త టె క్నిక్స్ ఉపయోగించాం. గ్రేట్ ఆపర్చునిటీ!
– రవి వానమ్

నీతా లుల్లా మమ్మల్ని ఎంచుకోవడం మా అదృష్టం. రాజరికపు లోకాల్లోకి మనలను తీసుకెళ్లే సినిమా ఇది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సెట్టింగ్, కాస్ట్యూమ్స్ ఉంటాయి. డెరైక్టర్ సూచనల మేరకు అనుష్క చేతులకు టాటూస్ వేశాను. నేను చాలా ఎగ్జైట్ అయిన మూమెంట్ అది.
– రచన

లక్షలాది రూపాయలు కేవలం కాస్ట్యూమ్స్ కోసమే ఖర్చు పెడుతున్న గుణశేఖర్, చివరికి సినిమా ఎలా తీస్తాడో? “రుద్రమదేవి” తో హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts