ఊరి జనాలకి "రెడ్డి" గారి హితబోద

0

Srinivasa-Reddy-Profile-Imageతన కెరీర్ మొదలైనప్పటి నుండి చిన్నా చితకా వేషాలు వేస్తూ వస్తున్న కమెడియన్ శ్రీనివాస రెడ్డి కి, మొన్న విడుదలైన “గీతాంజలి” సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. చిన్న చిన్న కామెడీయన్ పాత్రలు పోషిస్తున్న దశలో, “గీతాంజలి” సినిమా హీరో ఇమేజ్ ని ఇచ్చి తన సినిమా గ్రాఫ్ ని అమాంతం పైకి లేపింది అని శ్రీనివాసరెడ్డి కి తెలుసు. అయితే, ఈ ఫలితం వెనకాల ఎన్ని కష్టాలు – ఎన్ని కన్నీళ్ళు దాగున్నాయో , ఎన్ని అవమానాలు ఉన్నాయో అతనికి మాత్రమే తెలుసు. అంతేకాదు శ్రీనివాసరెడ్డి ఇటీవల ఖమ్మంలోని తను చదివిన కాలేజీ కి వెళ్ళి అక్కడి విద్యార్ధులతో మూడు గంటలకి పైగా గడిపి వచ్చాడు.

ఆ సందర్భంలో, కాలేజీ విద్యార్ధులు ఇతడిని అడిగిన అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాడు. ఇదే సందర్భంలో సినిమాలలోకి రావాలని ఇష్టపడుతున్న అక్కడి విధ్యార్ధులకు టాలీవుడ్ లోని ప్రస్తుత పరిస్థుతులు వివరిస్తూ సినిమాలలో అవకాశాలు రాకుంటే లైట్ బాయ్ గా అయినా బతకగలను అని నమ్మకం ఉంటేనే సినిమాలలోకి రమ్మని తాను తొలి నాళ్లలో పడ్డ కష్టాలను వివరిస్తూ తాను సినిమాలలో రాణించకపోతే సినిమాల ఫై ఉన్న వ్యామోహంతో తాను ఖచితంగా లైట్ బాయ్ గా అయినా మిగిలి ఉండే వాడినని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు శ్రీనివాస రెడ్డి. సినిమా రంగంలోని మరో కోణం గురించి ప్రజలకు తెలియని విషయాలు చెప్పడం మంచిదే అయినా ఈ మధ్య ఎందుకో చాలామంది సమంత దగ్గర నుండి శ్రీనివాస రెడ్డి వరకు ఇలా సినిమా రంగం గురించి చెడు విషయాలు చెప్పి అందర్నీ ఎందుకు భయ పెడుతున్నారో వారికే తెలియాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
 వీళ్లిద్ద‌రు హ్యాపీ...కానీ ఆయ‌న‌కు మాత్రం తిప్ప‌లే!
ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకునే డీప్ ల‌వ్ లో ఉన్న సంగతి  తెలిసిందే. ముంభై లో ప‌గ‌లు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపో...
powered by RelatedPosts