చిరు కనుసన్నల్లో "గోవిందుడు…"

0

Chiru-Birthday-Photos-6-300x336గత కొంతకాలంగా రాజకీయాలతో తీరిక లేకుండా గడిపిన చిరంజీవి, ప్రస్తుతం సినిమాల్లోకి తన రీ ఎంట్రీ ని ప్లాన్ చేసుకుంటున్న నేపధ్యంలో కాస్త ఇంటి పట్టునే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. అలా అని విశ్రాంతి తీసుకుంటున్నాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తన తనయుడు రామ్‌చరణ్ టెజ్ తాజాగా నటిస్తోన్న “గోవిందుడు అందరివాడేలే” సినిమాకి సంబంధించి మార్కెటింగ్ వ్యవ్యాహారాల్లో తలమునకలై ఉన్నాడు.

ఓవైపు చెర్రీ విదేశాల్లో సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటే…మరోవైపు చిరంజీవి గోవిందుడు కోసం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ పనులను చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారట. చెర్రి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటంతో…సినిమా ట్రైయిలర్ దగ్గర నుంచి మిగతా పనులను నాన్నకు అప్పగించేసి నిశ్చింతగా ఉన్నాడట. ఇదే విషయాన్ని చిరంజీవి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘గోవిందుడు అందరివాడేలే’ అక్టోబర్ 1న విడుదలకు సిద్ధం అవుతోంది. వచ్చే నెల వరుస సెలవులు రావటంతో ఈ సినిమాకు కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి, దసరా, ఆ తర్వాత వీకెండ్, అనంతరం బక్రీద్…ఇలా వరుసపెట్టి ఆరు రోజులు సెలవులు రావటం ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండటం చెర్రీకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts