చిరు కనుసన్నల్లో "గోవిందుడు…"

0

Chiru-Birthday-Photos-6-300x336గత కొంతకాలంగా రాజకీయాలతో తీరిక లేకుండా గడిపిన చిరంజీవి, ప్రస్తుతం సినిమాల్లోకి తన రీ ఎంట్రీ ని ప్లాన్ చేసుకుంటున్న నేపధ్యంలో కాస్త ఇంటి పట్టునే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. అలా అని విశ్రాంతి తీసుకుంటున్నాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తన తనయుడు రామ్‌చరణ్ టెజ్ తాజాగా నటిస్తోన్న “గోవిందుడు అందరివాడేలే” సినిమాకి సంబంధించి మార్కెటింగ్ వ్యవ్యాహారాల్లో తలమునకలై ఉన్నాడు.

ఓవైపు చెర్రీ విదేశాల్లో సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటే…మరోవైపు చిరంజీవి గోవిందుడు కోసం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ పనులను చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారట. చెర్రి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటంతో…సినిమా ట్రైయిలర్ దగ్గర నుంచి మిగతా పనులను నాన్నకు అప్పగించేసి నిశ్చింతగా ఉన్నాడట. ఇదే విషయాన్ని చిరంజీవి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘గోవిందుడు అందరివాడేలే’ అక్టోబర్ 1న విడుదలకు సిద్ధం అవుతోంది. వచ్చే నెల వరుస సెలవులు రావటంతో ఈ సినిమాకు కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి, దసరా, ఆ తర్వాత వీకెండ్, అనంతరం బక్రీద్…ఇలా వరుసపెట్టి ఆరు రోజులు సెలవులు రావటం ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండటం చెర్రీకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం
జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం' 
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'. అంజు వల్లభనేని, విషు...
powered by RelatedPosts