చెర్రీ అభిమానం సూప‌ర్!

0

మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ తర్వాత మెగా పవర్ స్టార్ గా ఎదిగిన హీరో రామ్ చరణ్. సినిమాల్లోకి వచ్చిన అతి కొద్దీ రోజులకే టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన ప్రవర్తనతో అభిమానులకు కూడా చాలా దగ్గరయ్యాడు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. తనను కలవడానికి వచ్చిన అభిమానులను నిరాశపరచకుండా కలుస్తున్నాడు చరణ్.

రీసెంట్ గా ఓ అంగవైకల్యం కలిగిన యువతి తన అభిమాన హీరో అయిన చరణ్ ని కలవడానికి షూటింగ్ స్పాట్ కి వచ్చింది. అప్పుడు చరణ్ హైదరాబాద్ కు దూరంగా ఉన్న ఓ ప్రాంతంలో చేస్తున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో ఎంతో కష్టపడి అక్కడకు వెళ్లిన దీపికను చరణ్ కలిశాడు. షూటింగ్ లో బిజీగా ఉన్నాసరే ఆ అమ్మాయితో ఫోటో దిగి కొంత సేపు మాట్లాడాడు. ఇక ఆ తర్వాత తన అనుచరులకు చెప్పి ఆ యువతిని జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పాడట. దీంతో ఆ యువతీ తన అభిమాన హీరో ఆప్యాయతకు ఆనందపడిపోయింది.

చరణ్ కు ఇలా వ్యవహరించడం కొత్తేమి కాదు. చాలాసార్లు ఫ్యాన్స్ ను కలవడమే కాకుండా బాధలో ఉన్నవారికి తనవంతు సహాయాన్ని అందించాడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పుడు చరణ్ ఓ బాలుడు గుండెజబ్బుతో బాధపడుతున్నాడని తెలుసుకొని అతనికి వైద్యాన్నీ చేయించి ఆదుకున్నాడు. చరణ్ సినిమాలతోనే కాకుండా తన మంచితనంతో కూడా అభిమానులకు మరింత దగ్గరవుతూ అద్భుతహా అనిపించుకుంటున్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
powered by RelatedPosts