బాబు విడుదల చేయనున్న"రౌడీఫెలో" రాగాలు

0

rowdy600యంగ్ హీరో నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా నటిస్తున్న ‘రౌడీ ఫెలో’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 13 వరకు జరగనున్న ఈ షెడ్యూల్లో రెండు పాటలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 13న గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఇది వరకు తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 13న జెఆర్సి కన్వెన్షన్ హాల్ లో జరగనున్న ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నాడు. అలాగే పలుగు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాట రీమిక్స్ చేశారు. ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను ‘రౌడీ ఫెలో’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

సన్నీ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని, మూవీమిల్స్ పతాకంపై ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts