`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!

0

ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగాది సందర్భంగా యువ కథానాయకుడు నితిన్, కథానాయిక మేఘా ఆకాష్ తో కలసి నటించిన “ఛల్ మోహన్ రంగ” చిత్ర ఆల్బిమ్ ని విడుదల చేశారు.

ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన మూడు పాటలులాగానే ఆల్బమ్లో కొత్తగా విడుదలైన మిగతా మూడు పాటలు వివిధమైన శైలిలో ఉన్నాయి.

ఆల్బమ్ లో ప్రతీ పాటని కొత్తగా కొట్టడమే కాకుండా ప్రతీ పాటని హిట్ చేయగల అతి తక్కువ సంగీత దర్శకులలో ఒకరు థమన్. మాస్ నుంచి క్లాస్ వరకు, ప్రేమ నుంచి విరహం వరకు , సంతోషం నుంచి బాధ వరకు, అనింటిని ఎంతో బాగా స్వరపరిచి ఒక పూర్తిస్థాయి ఆల్బమ్ ఇచ్చారు.

యు.ఎస్, ఊటీ, హైదరాబాదలలో ఎన్నో అందమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినీమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.

చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

సంగీతం: థమన్.ఎస్,
కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్,
కూర్పు: ఎస్.ఆర్.శేఖర్,
నృత్యాలు:శేఖర్.వి.జె,
పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ;
సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి
నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
ఛల్ మోహన్ రంగ టీజ‌ర్ విడుద‌ల‌
మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.చిత్రం టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ @pkcreativeworks ఖా...
నితిన్-ప‌వ‌న్ ఫ‌స్టు లుక్ వ‌చ్చేసింది
'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్ర...
powered by RelatedPosts