మరీ అన్ని సార్లు పిలిస్తే రాను

0

hansika-new-stills-3ఎవరు ఎవర్ని పిలిస్తే రారు అంటున్నారు అని ఆలోచిస్తున్నారా? మరేం లేదండీ… ముద్దు కమ్ బొద్దుగుమ్మ హన్సిక ఒక సినిమా కోసం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డేట్స్ ఇచ్చా అని ఫీల్ అయిపోతోంది పాపం. ‘ఇక ఆ సినిమాకి డేట్స్ ఇవ్వనంటే ఇవ్వను’ అని తన సన్నిహితుల దగ్గర చెబుతోందట హన్పిక. ఆమె అలా చెబుతున్నది తమిళ చిత్రం ‘వాలు’ గురించి అని సమాచారం. శింబు, హన్సిక జంటగా ఈ చిత్రం ఆరంభమైంది. ఈ చిత్రం సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. ఇంకా సినిమా ముగియలేదు కానీ.. వీళ్ల ప్రేమకథ మాత్రం ముగిసింది.

కాగా, హన్సికపై ఈ చిత్రనిర్మాత చక్రవర్తి కోపంగా ఉన్నాడని సమాచారం. ‘వాలు’ చిత్రం పూర్తి చేయడానికి హన్సిక సహకరించడంలేదని తమిళ చలన చిత్రం నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడట చక్రవర్తి. ఇది తెలిసిన హన్సిక తన సన్నిహితుల దగ్గర వాపోతోందట. ఈ చిత్రానికి మొత్తం 64 రోజులు డేట్స్ ఇచ్చానని, ఆ తర్వాత అదనంగా 20 రోజులు డేట్స్ ఇచ్చానని ఫ్రెండ్స్ దగ్గర చెప్పిందట హన్సిక. కానీ, తాను ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ సక్రమంగా చేయలేదని, ఆ మధ్య మరో మూడు రోజులు అడిగితే కాదనుకుండా ఇచ్చానని పేర్కొందట.

ఆ మూడు రోజులు షూటింగ్ చేయకుండా, కొన్ని కారణాల వల్ల రద్దు చేశారని హన్సిక అంటోందట. అందుకని, ఇక ఈ సినిమాకి మళ్లీ డేట్స్ ఇచ్చే ప్రసక్తే లేదని బలంగా నిర్ణయించుకుందని సమాచారం. హన్పిక నిర్ణయం తెలుసుకున్న తర్వాతే నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లాడట చిత్రనిర్మాత చక్రవర్తి. మరి.. ఈ వివాదానికి ఎలా తెర దిగుతుందో చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts