ఏప్రిల్ 10న 'బుడుగు' విడుదల

0

940020మంచు లక్ష్మి, శ్రీధర్ రావ్, మాస్టర్ ప్రేమ్ బాబు, బేబీ డాలి ముఖ్య పాత్రధారులుగా మన్మోహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుడుగు’. సుధీర్ సమర్పణలో హైదరాబాద్ ఫిలిం ఇన్నోవేటివ్స్ పతాకంపై భాస్కర్, సారికా శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సైకాలజిస్ట్ గా ఇంద్రజ నటించారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ – ”ఒక ఎనిమిదేళ్ల బాలుడి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించాం. కథ గురించి చెప్పాలంటే… బుడుగు ఎనిమిదేళ్ల బాలుడు. అమ్మా, నాన్న, చెల్లెలు, ఓ బుజ్జి కుక్క పిల్ల… ఇదీబుడుగు కుటుంబం. తన వయసున్న పిల్లలందరిలా బుడుగు హుషారుగా ఉండడు. ఎవరితోనూ కలవడు. ఉద్యోగాలతో బిజీగా ఉండే తల్లిదండ్రులకు ఇది తెలియదు. చివరికి స్కూల్ నుంచి, ఇరుగు పొరుగు నుంచి బుడుగు గురించి వచ్చిన ఫిర్యాదులతోబుడుగుని బోర్డింగ్ స్కూల్ లో చేర్చాలనుకుంటారు. ఇదిలా ఉంటే బుడుగు విచిత్రమైన ప్రవర్తన అతని తల్లిదండ్రులను కలవరపెడుతుంది. ఇతరులకు కనిపించనవి చూసినట్లుగా చెబుతాడు. ఆందోళన చెంది, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళతారు.బుడుగు గురించి ఆ సైకాలజిస్ట్ తెలుసుకున్న నిజాలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే చిత్రం ఇది” అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ – ”చక్కని ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. చిన్న పిల్లల మనస్తత్వాన్ని, వారు ఎదుర్కొనే సమస్యల్ని దర్శకుడు హృద్యంగా ఆవిష్కరించారు” అన్నారు.
సన, ఇందుఆనంద్, శైలజవాణి, అల్తాఫ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సురేష్ రఘుతు, ఎడిటింగ్: శ్యామ్, ఆర్ట్: ఎ. రామ్, రచన, దర్శకత్వం: మన్మోహన్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts