'బుడుగు' సక్సెస్ మీట్..!

0

Budugu Success Meet (5)సుధీర్ సమర్పణలో హైదరాబాద్ ఫిల్మ్ ఇన్నోవేటీస్ ప్రై లిమిటెడ్ పతాకంపై మన్ మోహన్ దర్శకత్వంలో బాస్కర్, సారికా శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘బుడుగు’. ఏప్రిల్ 17న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సారికా శ్రీనివాస్ మాట్లాడుతూ “ఏప్రిల్ 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసాం. నిన్నటి నుండి వచ్చిన పాజిటివ్ టాక్ తో ఈరోజు కొత్తగా మరో 30 థియేటర్లు యాడ్ అయ్యాయి. క్రిటిక్స్ నుండి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ప్రీక్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. మంచు లక్ష్మి గారు తల్లి పాత్రలో చక్కగా నటించారు. మాస్టర్ ప్రేమ్ బాబుకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్ళింది” అని తెలిపారు.
మన్ మోహన్ మాట్లాడుతూ “8 సంవత్సరాల అబ్బాయికి, తన ఫ్యామిలీ కి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఏప్రిల్ 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రానికి రెండో రోజునే థియేటర్లు పెరగడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసి అందరు హార్రర్ సినిమా అనుకున్నారు కానీ ఇదొక ఫ్యామిలీ మూవీ. అనుకున్నదానికంటే ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. శ్రీధర్, మంచు లక్ష్మి అధ్బుతంగా నటించారు” అని చెప్పారు.
శ్రీధర్ రావు మాట్లాడుతూ “ఈ సినిమాలో ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు. ఈ సినిమాలో చూడలేని సన్నివేశాలు కాని నీచమైన భాష కాని లేవు. క్లీన్ మూవీ ఇది. తప్పకుండా అందరు చూడదగ్గ సినిమా. ప్రతి సన్నివేశానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా వచ్చింది” అని తెలిపారు.
సాయి కార్తిక్ మాట్లాడుతూ “అన్ని చోట్ల నుండి సినిమాకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
మాస్టర్ ప్రేమ్ బాబు మాట్లాడుతూ “ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ నా థాంక్స్” అని చెప్పారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts