ఆగ‌స్టు 4న రిలీజ్ అవుతున్న `బుడ్డారెడ్డిప‌ల్లి బ్రేకింగ్ న్యూస్`

0

శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ సినిమా ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `బుడ్డారెడ్డిప‌ల్లి బ్రేకింగ్‌న్యూస్‌`. న‌ర‌సింహ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బూచేప‌ల్లి తిరుప‌తి రెడ్డి నిర్మాత‌. ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌డానికి బుధ‌వారం హైద‌రాబాద్‌లో చిత్ర‌యూనిట్ విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది. జ‌బ‌ర్ద‌స్త్ అభి, సందీప్తి, ఫ‌ణి జ‌బ‌ర్ద‌స్త్, వ‌రుణ్ తో పాటు ప‌లువురు న‌టీన‌టులు ఈ సినిమాలో న‌టించారు.
ద‌ర్శ‌కుడు న‌ర‌సింహ నంది మాట్లాడుతూ “ఇదొక వినూత్న త‌ర‌హా చిత్రం. ఇలాంటి చిత్రం తెలుగులో రావ‌డం మొట్ట‌మొద‌ట‌సారి ఇదే. గేదెను హీరోగా చేస్తూ చేసిన సినిమా ఇది. గేదె ప్రాధాన్య‌త‌ను ఇందులో చూపిస్తున్నాం. ఈ చిత్రం చూసిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూఏ జంతువుల ప‌ట్ల‌, ప‌క్షుల ప‌ట్ల ప్రేమ‌గానూ, బాధ్య‌త‌గానూ ఉంటారు స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌గా తీసిన చిత్రం. మ‌నుషులు మూగ‌జీవుల ప‌ట్ల ఎంత ప్రేమ‌గా ఉంటారో తెలిపే సినిమా ఇది. ఆగ‌స్ట్ 4న విడుద‌ల చేస్తున్నాం. డా. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి రాసిన మీడియా పాట‌కు చాలా చ‌క్క‌టి స్పంద‌న వ‌స్తోంది“ అని చెప్పారు.
సంగీత ద‌ర్శ‌కుడు సుక్కు మాట్లాడుతూ “ఈ సినిమాలో సందేశంతో పాటు మంచి విష‌యాలు కూడా ఉన్నాయి. మంచి వాణిజ్య విలువ‌లున్న సినిమా. అంద‌రికీ న‌చ్చుతుంది. న‌ర‌సింహ నంది క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌తో మాత్ర‌మే కాకుండా… మ‌నిషితో పాటు ప్ర‌తి జీవ‌రాశి ప్రాణం ముఖ్య‌మ‌ని ఇందులో చూపించారు. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. మీడియా మీద రాసిన పాట‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది“ అని అన్నారు.
స‌హ నిర్మాత‌లు: పీ ఎల్ కే రెడ్డి, పాశం వెంక‌టేశ్వ‌ర్లు, బ‌జాజ్ బుజ్జి, ఆలేటి శ్రీనివాస‌రావు, బ‌ద్ధ‌ల హ‌రిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: కుల‌కలూరి ర‌విబాబు, ర‌ఫి, డేవిడ్ జేమ్స్, సంగీతం: సుక్కు, కెమెరా: ముర‌ళీమోహ‌న్ రెడ్డి, ఎడిట‌ర్‌: నాగిరెడ్డి, పాట‌లు: డా. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి, సాగ‌ర్‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌ర‌సింహ నంది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న...
powered by RelatedPosts