బోయ‌పాటినా..మ‌జాకా!

0
ఆన్ స్ర్కీన్ పై హీరోను ఎలివేట్ చేయ‌డంలో మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను స్పెషాలిటీనే వేరు. క‌థ ఎలా ఉన్నా అందులో హీరో పాత్ర‌ను మాత్రం పీక్స్ లో చూపించ‌డం అనేది పూరి జ‌గ‌న్నాథ్  త‌ర్వాత బోయ‌పాటికే చెల్లింది. అందుకే మాస్ ఇమేజ్ కోసం యంగ్ హీరోలంతా బోయ‌పాటి సినిమాల్లో న‌టించాల‌ని ఉవ్విళ్లూరుతుంటారు. ఇటీవ‌లే ఓ అడుగు ముందుకేసి యంగ్ హీరో సాయి శ్రీనివాస్ ను స్టార్ గా తీర్చిదిద్దే బాధ్య‌త‌ల్ని తీసుకున్నాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో `జ‌య జానికి నాయ‌క` అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ ను రివీల్ చేసి సినిమాపై హైప్ ను క్రియేట్ చేశారు.
తాజాగా సాయి శ్రీనివాస్ మాస్ లుక్ ను కూడా మార్కెట్ లోకి వ‌దిలేశారు. క్లాసిక్ టైటిల్ తోనే సిస‌లైన మాస్ హీర‌యిజం ను సినిమా లో  చూపిస్తున్న‌ట్లు ఒక్క స్టిల్ తో బ‌ట్ట‌బ‌య‌లైంది. స్కిన్ టైట్ టీ ష‌ర్ట్.. రైట్ హ్యాండ్ పిడికిలి బిగించిన సాయి లుక్ లో ఒక్క దొబ్బ‌కు కొండ‌ను సైతం పిండిని చేసే ద‌మ్మున్న కుర్రాడిగా ఆవిష్క‌రిస్తున్నాడ‌ని తెలుస్తోంది. పోస్ట‌ర్ అద్భుతంగా డిజైన్ చేశారు. మ‌రి బోయ‌పాటినా? మ‌జాకా? 
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మూడు కోట్ల సెట్ లో  బీచ్ ఫెస్టివల్ సాంగ్ !!
ఇప్పటికే విడుదలైన టీజర్-పోస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న "జయ జానకి నాయక" ఖాతాలో మరో విశేషం చేరింది. ఎన్నడూలేని విధంగా.. విశాఖపట్నం సమీపం...
`నిన్ను కోరి` రివ్యూ
నటీనటులు : నాని, నివేదా థామస్, ఆది పిని, త‌నికెళ్ల భ‌ర‌ణి దర్శకత్వం : శివ నిర్వాణ నిర్మాత : డి.వి.వి దానయ్య సంగీతం : గోపి సుందర్ మాస్టార్స్ ....
KTR and Boyapati In Haritha Haram
https://youtu.be/h74lJTxU8Rs...
powered by RelatedPosts