భోజ్ పురి `బాహుబ‌లి` తొలి రూపు

0

రాజ‌మౌళి ట్యాలెంట్ ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన అద్భుత దృశ్య‌రూపం `బాహుబ‌లి` భోజ్ పురిలో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భోజ్‌పూరి నటుడు దినేశ్‌ లాల్‌ యాదవ్‌ నిరహువా కథానాయకుడిగా అమ్రపాలి డుబే కథానాయిక న‌టిస్తున్నారు. ‘వీర్‌ యోధ మహాబలి’ తో అనువాద‌మ‌వుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. అశ్వంపై యోధుడు….ఆ పై స్వారీ…క‌త్తుల యుద్దాల‌తో కూడిన కొన్ని పోస్ట‌ర్లు రిలీజ్ చేశారు. దీన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ్‌, బెంగాళీ, భోజ్‌పూరి భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్బాల్‌ బక్ష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం. రమేశ్‌ వ్యాస్ నిర్మిస్తున్నారు. భోజ్ పురి న‌టుల‌కు ఈ సినిమా కొత్త అనుభూతినిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అక్క‌డ ఏ ద‌ర్శ‌క‌, నిర్మాత చేయ‌డానికి ముందుకు రారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts