బిగ్ బాస్ షో నాకొక ఛాలెంజింగ్: య‌ంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

0
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్’ షో  ఈ నెల 16 నుండి ప్రసారం కానుం ఈ సందర్భంగా ఈ రోజు (శ‌నివారం) ఉద‌యం  హైదరాబాద్‌లో ‘బిగ్‌బాస్’ షోను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. నాకసలు టీవీలో హోస్ట్‌గా ఎలా బిహేవ్ చేయాలని కానీ, ఎలా మాట్లాడాలని కానీ, ఎలా నటించాలని కానీ తెలీదు. అసలు ఏ క్లూ లేదు. ఎప్పుడూ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే స్టార్ మా బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయమని చెప్పి నా దగ్గరకు వచ్చిందో.. రెండో నిమిషం కూడా ఆలోచించలేదు. వెంటనే ఓకే చెప్పేశాను. ఐ లైక్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. సో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా చేయడం మరో ఛాలెంజ్. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. భారతదేశంలో ఇంత పెద్ద రియాలిటీ షోకు తెలుగులో నన్ను హోస్ట్‌గా తీసుకున్న స్టార్ మాకు ధన్యవాదాలు.’’ అన్నారు.
స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్‌ జైన్‌ మాట్లాడుతూ – ”ఎన్టీఆర్‌ మా రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు మార్కెట్‌లో బిగ్టెస్ట్‌ షోగా బిగ్‌ బాస్‌ జులై 16 రాత్రి 9 గంటలకు నుండి ప్రసారం కానుంది. ప్రపంచంలోని నలబై దేశాల్లో ఈ షో హ్యుజ్‌ సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడుతెలుగులో ప్రసారం కానుంది. 80 డిఫరెంట్‌ షోస్‌ మన ఇండియాలో ఉన్నాయి. అందులో 20 ప్రస్తుతం మంచి ట్రెండ్‌లో ఉన్నాయి. అయితే ఈ బిగ్‌బాస్‌ షో వీటన్నింటి కంటే ప్రత్యేకమైంది. తొలిసారి ఎన్టీఆర్‌ బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం నాకు పెద్ద ప్లస్‌ అవుతుంది. ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. అల్రెడి విడుదలైన ప్రోమోస్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ షో స్టార్‌మా మరింత పేరును తీసుకొస్తుందని భావిస్తున్నాను తమిళంలో కమల్‌గారు చేస్తున్న షోకు మంచి స్పందన వచ్చింది తెలుగులో 71 ‘ ఏపిసోడ్స్‌ ప్లాన్‌ చేస్తున్నార” అన్నారు .
విన్సెంట్‌ మాట్లాడుతూ – ”అప్పో సంస్థ స్టార్‌మాతో అసోసియేట్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది. మేం అదృష్టంగా భావిస్తున్నాం. బిగ్‌బాస్‌ గ్రేట్‌ షో అవుతుందని భావిస్తున్నాం” అన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో ఈ షోకు సంబంధించిన మరో స్టన్నింగ్ ప్రోమోను విడుదల చేశారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న...
powered by RelatedPosts