భ‌ర‌త్ మా బ్యాన‌ర్లో గ‌ర్వ‌ప‌డే సినిమా అవుతుంది: నిర్మాత దాన‌య్య‌

0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` ఈనెల 20 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య సినిమా విశేషాల‌ను మంగ‌ళ‌వారం హైదరాబాద్ లో మీడియా స‌మ‌క్షంలో వెల్ల‌డించారు.

1992లో `జంబ‌ల‌క‌డి పంబ` సినిమాతో నిర్మాత‌గా ప్ర‌యాణం మొద‌లైంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశాను. చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌నిచేశాను. మ‌హేష్ బాబు తో సినిమా చేయాల‌న్న‌ది ఎప్ప‌టి నుంచో నా క‌ల‌. 2006 నుంచి ప్ర‌య‌త్నం చేస్తున్నాను. అది ఇప్ప‌టికి కుదిరింది. అదీ మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా నేను చేయ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి ఆ పాత్ర గురించి చెప్ప‌గానే థ్రిల్ ఫీల‌య్యాను. ప్రేక్ష‌కులు కూడా అలాగే ఫీల్ అవుతారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్ర‌తీ సీన్ థియేట‌ర్లో కూర్చోబెట్టేలా ఉంటుంది. దాన‌య్య అనే నేను `భ‌ర‌త్ అనే నేను` సినిమా అంద‌ర్ని అల‌రిస్తుందిన హామీ ఇస్తున్నాను.

ఈ సినిమా చేసినందుకు కోర‌టాల కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. మా బ్యాన‌ర్ గ‌ర్వ‌ప‌డే సినిమా అవుతుంది. నేను ప‌నిచేసిన హీరోలంద‌రికంటే మ‌హేష్ తో ఎక్కువ సాన్నిహిత్యం ఏర్ప‌డింది. ఉయ‌దం సెట్స్ కి వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఉంటారో? సాయంత్రం ఇంటికి వెళ్లేట‌ప్పుడు అంతే ఎన‌ర్జీతో ఉంటారు. సెట్స్ లో స‌ర‌దాగా జోకులు వేస్తూ న‌వ్విస్తుంటారు. కైరా అద్వాణీ ఉత్త‌రాది అమ్మాయిలా అనిపించ‌దు. చాలా స‌హ‌జంగా న‌టించింది. ఈ సినిమా త‌ర్వాత ఆమెకు మంచి అవ‌కాశాలు వ‌స్తాయి. దేవి శ్రీ ప్ర‌సాద్ మూడు , నాలుగు సార్లు సినిమా చూసారు. అదిరిపోయింది సార్ అంటూ ఫోన చేసి చెప్పారు. సినిమా కూడా ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయేలా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు` అని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
ఏప్రిల్‌ 20న భ‌ర‌త్, మే 4న సూర్య
రెండు చిత్రాల నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం ఏప్రిల్‌ 26నే 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో త...
powered by RelatedPosts